NTV Telugu Site icon

Bhatti Vikramarka Padayatra: ఇది అడ్డగోలు జీవోల ప్రభుత్వం

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పీపుల్స్ మార్స్ పాదయాత్రకు అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రభుత్వంపై ఆయన మండిపడుతున్నారు. ప్రజల మధ్యే తిరుగుతూ వారి బాగోగులు విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు జీవోలను సృష్టిస్తూ పబ్బం గడుపుకుంటుందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. సీఎం కేసిఆర్ వరి వేయవద్దని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పారు. కానీ నకిలీ విత్తనాలు బాగా మార్కెట్ లోకి వస్తే కేసీఆర్ ఏం చేశాడని భట్టి అన్నారు.

గతంలో రైతులకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చేది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక రుణాలు ఇవ్వలేదు. ఎరువుల ధరలను ప్రభుత్వం విపరీతంగా పెంచడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కు 1500 కోట్ల ఇస్తే. వేలాది ఎకరాలకు సాగు నీరు అందేది కానీ ఈ ప్రభుత్వం సీతా రామ ప్రాజెక్ట్ పేరుతో 25 వేల కోట్లు వెచ్చించినప్పటికీ ఇంతవరకు చుక్క నీరు లేదు. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయకు లెక్క చెప్పాలని అన్నారు. ప్రాజెక్ట్ ల డీపీఆర్ ఎందుకు బయట పెట్టడం లేదని భట్టి ప్రశ్నించారు. ముదిగొండ మండలం భట్టి విక్రమార్క పాదయాత్ర సాగుతోంది.

పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మధిర నియోజకవర్గంలో పూర్తి చేసి సీఎల్పీ నాయకుడిగా రాష్ట్రంలోని అన్ని మండలాలు తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటానన్నారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నామో అది నెరవేరలేదు. అది కొద్ది మందికే ఉపయోగపడుతుంది. తెలంగాణలో సృష్టించే సంపద ఏమై పోతుంది…? ఈ పాలన మారాలి సంపద ఇక్కడి ప్రజలకు చెందాలి. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిసిన వ్యక్తిగా ఇక్కడి సంపద ప్రజలకు అందే వరకు పోరాటం సాగిస్తా. గోకినేపల్లి సమీపంలోని మామిడి తోటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్శీ పోట్ల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు.