Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bhatti Vikramarka Orders Release Of 303 Crores Overseas Scholarship

Bhatti Vikramarka : ఓవర్సీస్ స్కాలర్షిప్ 303 కోట్లు వెంటనే విడుదల

Published Date :October 29, 2025 , 9:50 pm
By Gogikar Sai Krishna
  • ఓవర్సీస్ స్కాలర్షిప్ 303 కోట్లు వెంటనే విడుదల చేయండి
  • 2022 నుంచి నేటి వరకు మొత్తం బకాయిలు క్లియర్ చేయండి
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశం
Bhatti Vikramarka : ఓవర్సీస్ స్కాలర్షిప్ 303 కోట్లు వెంటనే విడుదల
  • Follow Us :
  • google news
  • dailyhunt

పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీ స్కాలర్షిప్ బకాయిలు 303 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆదేశించారు.

నిరాశ, నిస్పృహల్లో ఉన్న వేల కుటుంబాల్లో డిప్యూటీ సీఎం ఆదేశాలు ఆనందం నింపింది. ఆర్థిక స్తోమత లేకపోయినప్పటికీ విదేశాల్లో ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించి ఆర్థికంగా ఉన్నత స్థితికి ఎదగాలని ఆలోచనతో వేలాది మంది పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు ఓవర్సీస్ స్కాలర్షిప్ పై విదేశాలకు వెళ్లారు.

గత ప్రభుత్వ కాలం నుంచి ఓవర్సీస్ స్కాలర్షిప్ అందకపోవడంతో విదేశాల్లో ఉన్న విద్యార్థులు, రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. ఓవైపు ఓవర్సీస్ స్కాలర్షిప్ అందక మరోవైపు అమెరికా, యూకే వంటి దేశంలో కొత్త కొత్త ఆంక్షలతో విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీవ్రమైంది.

ఆయా దేశాల్లో గతంలో మాదిరిగా చదువుకుంటూ ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి లేదు. అక్కడ రోజురోజుకు ఆర్థిక భారం పెరిగిపోతుంది. మరోవైపు బ్యాంకుల్లో తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ భారం పెరుగుతుంది. ఈ పరిస్థితిలన్నిటిని అవగాహన చేసుకున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఈ సమస్యను ప్రాధాన్యత అంశంగా భావించి ఓవర్సీస్ స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న సమయంలో డిప్యూటీ సీఎం ఆదేశాలతో వేలాది కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి. కష్టకాలంలో ప్రభుత్వం ప్రతి విద్యార్థి సుమారు 20 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో తమ బిడ్డలు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారని, తమ ఇబ్బందులు తొలగిపోతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో అనుకున్న లక్ష్యాన్ని సాధించి రాష్ట్రానికి, దేశానికి తిరిగి అర్థవంతమైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని ఆశాభావంతో ఉన్నట్టు ఓవర్సీస్ విద్యార్థులు తెలిపారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bhatti vikramarka
  • Education Funding
  • Overseas Scholarship
  • telangana government
  • telangana students

తాజావార్తలు

  • AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..!

  • Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో పేలుడు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

  • Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..

  • UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం

  • India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్‌లు..!

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions