కాంగ్రెస్ లో మునుగోడు ఎన్నిక వివాదం ముగిసినట్లు కనిపిస్తోంది. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రచారంలో పాల్గొంటారా? అన్న దానిపై సస్పెన్స్ వీడింది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటానని వెంకట్రెడ్డి ప్రకటించారు. పార్టీ ఎప్పుడు పిలిచినా ప్రచారానికి వెళ్తానన్నారు. మునుగోడు ప్రచారానికి వెళ్లనని తొలుత చెప్పిన వెంకట్రెడ్డి.. ప్రియాంక గాంధీతో భేటీ తర్వాత తన మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈవిషయాన్ని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో జరిగిన భేటీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక మునుగోడు అభ్యర్థి ఎంపికపై తన అభిప్రాయాన్ని భట్టి కోరారని, అభ్యర్థి విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పానని అన్నారు వెంకట్‌రెడ్డి. దీంతో.. అభ్యర్థిని సర్వేల ఆధారంగా ఎంపిక చేస్తారని, ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపిన ఆయన ఎప్పుడు అవసరం అనుకుంటే అప్పుడు ప్రచారంలో పాల్గొంటానని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
ఇక సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. మునుగోడు అభ్యర్థి ఎంపికపై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో చర్చించామని, అభ్యర్థి ఎంపికలో అనుసరిస్తున్న విధానాన్ని ఆయనకు వివరించామని తెలిపారు. అభ్యర్థి ఎంపికలో పార్టీ నిర్ణయానికి వెంకట్రెడ్డి సహకరిస్తారని వివరించారు. నిన్న గాంధీభవన్‌లో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నేతృత్వంలో మునుగోడు అభ్యర్థి ఎంపికపై బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆర్.దామోదర్‌రెడ్డి, నల్గొండ, భువనగిరి రెండు జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఈసమావేశం రాత్రి దాదాపు రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం కొనసాగింది. ఇక జానారెడ్డి, జీవన్‌రెడ్డి జూమ్‌లో హాజరయ్యారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో భాజపా, టీఆర్‌ఎస్ మధ్య మాటల యుద్ధం, పరస్పర విమర్శలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
CJI NV Ramana: నేడు సీజేఐ ఎన్వీ రమణ పదవీ విరమణ
