NTV Telugu Site icon

Bhatti Vikramarka: కేసీఆర్ కేటీఆర్ లాంటి వారు కుల గణన సర్వేలో భాగస్వామ్యం కావాలి..

Batti

Batti

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గాంధీ భవన్ లో కుల గణన పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని ఫలాలు జనాభా దామాషా ప్రకారం పంచాలని రాహుల్ గాంధీ ఆలోచన అని అన్నారు. ప్రణాళిక బద్దంగా సమగ్ర కుల సర్వే సంపూర్ణంగా జరిగింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసింది. ప్రభుత్వం అంటే పన్నులు వసూలు చేసి.. పాలించడం కాదు. దేశంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు కాంగ్రెస్ తెచ్చిన చట్టాల వల్లనే జరిగాయని అన్నారు.

Also Read:Shashi Tharoor: మోడీ-ట్రంప్ భేటీపై కాంగ్రెస్ ఎంపీ ప్రశంసలు.. హుందాగా ఉందని కితాబు

చిన్న పొరపాటు లేకుండా.. ఎవరు వేలెత్తి చూపకుండా పక్కగా కుల సర్వే చేపట్టామని తెలిపారు. ప్రతిపక్షాలు రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ లిస్టింగ్ చేసిన కుటుంబాలు 1,15,71,457. సర్వే లో పాల్గొన్న కుటుంబాలు 1,12,15,134. సర్వే లో పాల్గొనని కుటుంబాలు 3,56,323 (3.01శాతం). సర్వే విజయవంతంగా కాకూడదని అనుకున్న కేసిఆర్, కేటీఆర్ సర్వే లో పాల్గొన లేదు. కొన్ని ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. సర్వేలో పాల్గొన్న రాష్ట్ర ప్రజలు 3కోట్ల 70 లక్షల మంది అని వివరాలు వెల్లడించారు.

Also Read:Sanam Teri Kasam: పాకిస్థానీ నటి “సరస్వతి” పాత్రలో నటించి సినిమా.. రీ-రిలీజ్‌లో భారీ వసూళ్లు..

కుల గణన, sc వర్గీకరణపై బీఆర్ఎస్ పార్టీవి అభియోగాలు మాత్రమేనని అన్నారు. ప్రభుత్వం పకడ్బందీగా చేసిన లెక్కల చిట్టాను ప్రతి కార్యకర్త బల్లగుద్ది వివరించవచ్చు అని సూచించారు. ఇష్టంతోనే మా సర్వే సిబ్బందికి ప్రజలు వివరాలు ఇచ్చారు. ప్రజలు ఇష్టంగా ఇచ్చినట్టు వారి సంతకాలు సైతం నమోదు చేశారు. సర్వే పుస్తకాలు డేటా ఎంట్రీతో నిక్షిప్తం చేశారు. సర్వే జరగకుండా కొందరు కుట్రలు పన్నారు. చట్టపరమైన సవాళ్లు ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.