Bhatti Vikramakra : తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఫ్యూచర్ సిటీ గేమ్ ఛేంజర్ అని వ్యాఖ్యానించారు. మూసీ పునర్జీవనం, రీజనల్ రింగ్ రోడ్డు పూర్తయితే హైదరాబాద్ అభివృద్ధి ఊహకు అందదని ఆయన అన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు ఎప్పుడైనా సీఎం రేవంత్ రెడ్డి, యావత్ కేబినెట్, ఉన్నతాధికారులను సంప్రదించవచ్చు అని ఆయన అన్నారు. మా ప్రభుత్వ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని, పెండింగ్ పవర్ బిల్లుల వన్ టైం సెటిల్మెంట్ గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు.
Kiran Abbavaram : బూతులతో సినిమా.. కిరణ్ అబ్బవరం ఫ్రస్ట్రేషన్..
ప్రభుత్వం పరిశ్రమలు పౌర సమాజం అంతా కలిసి పని చేద్దాం.. హైదరాబాదులో సృష్టించే సంపదను రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకెళ్దామని, సంపద సృష్టించడం ఒక సాధన మాత్రమే మన ప్రజల గౌరవాన్ని పెంపొందించడం వారి ఆశయాలను నెరవేర్చడం ప్రభుత్వ లక్ష్యమన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కీ వందేళ్ల పైగా అనుభవం ఉందని, హైదరాబాద్ నగరం ఒక వర్తక నగరం నుంచి ప్రపంచ స్థాయి నగరంగా ఎదిగే వరకు ప్రతి దశలోనూ FCCI ముందు నడిచిందన్నారు భట్టి విక్రమార్క.
