Bhatti Vikramarka : అగ్నిపథ్‌ను తక్షణమే విరమించుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయాలనే డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు మధిర నియోజక వర్గ కేంద్రంలోని ఆర్వి కాంప్లెక్స్ ఎదురుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన వెల్లడించారు. బీజేపీ తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం దేశ ప్రజల రక్షణ కోసం తక్షణమే విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్ఎస్ఎస్ వ్యక్తులను భారత రక్షణ రంగంలో పంపటం కోసమే కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చిందని ఆయన మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలవల్లే నిరుద్యోగులను ఆందోళన వైపు పురిగొల్పుతున్నాయన్నారు. రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతి ఉద్యోగాలు ఇవ్వటం దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
బీజేపీ నిర్ణయాల వల్ల దేశంలో యువత హింస వైపు అడుగులు వేస్తోందని, ప్రభుత్వరంగ సంస్థలు అమ్మటం అంటే భారతదేశాన్ని అమ్మటమేనని ఆయన ఆరోపించారు. యువతకు ఏడాదికి రెండు కోట్లు ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగాలను భర్తీ చేయకపోగా, గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వ రంగ సంస్థలను బహుళజాతి సంస్థల అధిపతులు అయిన అంబానీ ఆదానీలకు దారాదత్తం చేస్తూ ఉన్న ఉద్యోగాలను కొల్ల గొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరూ కలిసి దేశాన్ని ఆదానీ, అంబానీ లకు అమ్ముతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాలన్న భట్టి.. గాంధీ అడుగుజాడల్లో నడుస్తూ శాంతియుతంగా సత్యాగ్రహం చేపట్టిన కాంగ్రెస్ కార్యకర్తలను అభినందించారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Prajavani: మండల కేంద్రాల్లో ప్రజావాణి.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
- ఆ కార్యాలయాలకు టీ ఫైబర్ ఇంటర్నెట్ సేవలు.. సెప్టెంబర్ 1 తర్వాత బిల్లులు చెల్లించొద్దు: మంత్రి శ్రీధర్ బాబు
- Hyderabad: నిత్యం వాడే మసాలాల్లో విషపూరిత కేమికల్స్.. 25 టన్నుల నకిలీ మసాలాలు స్వాధీనం..
తాజావార్తలు
-
Oppo A7 Pro Max: ఒప్పో A7 ప్రో మాక్స్ రిలీజ్.. 10000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vaddi Kasula Vaadu: మంచు మనోజ్ ‘వడ్డీ కాసుల వాడ’లో అదిరే సర్ప్రైజ్… వెంకటేశ్వర స్వామిగా జయం రవి
-
India Flagged Cargo Ship Attack: యెమెన్ తీరంలో భారత కార్గో నౌకపై దాడి.. ఘటన సమయంలో 14 మంది సిబ్బంది..!
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!