Bhatti Vikramarka : ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం

  • ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశం
  • పాల్గొన్న డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
  • ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామన్న భట్టి
  • రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపామని వెల్లడి
Bhatti

Bhatti

ప్రజాభవన్ లో కాంగ్రెస్ కీలక నాయకులు సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ఆగస్టు దాటకుండానే రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తామని తెలిపారు. రుణమాఫీ కార్యక్రమం అమలు చేసేందుకు నిద్రలేని రాత్రులు గడిపాము.. రూపాయి రూపాయి పోగుచేసి ఈ కార్యక్రమం చేపట్టామని, అన్ని కుటుంబాలకు రుణమాఫీ చేస్తామన్నారు భట్టి విక్రమార్క. రేషన్ కార్డులు లేని ఆరు లక్షల మంది రైతు కుటుంబాలకు రుణమాఫీ అందిస్తామని, ఎవరిని వదలం.. ఎవరికి అవకాశం ఇవ్వమన్నారు భట్టి విక్రమార్క. కాంగ్రెస్ నాయకులారా రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రతి పోలింగ్ బూతు, ప్రతి ఓటర్ దగ్గరకు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. తల ఎత్తుకొని … ఎక్కడ తగ్గకుండా ప్రచారం చేయండని, మిగులు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని 25000 చొప్పున.. నాలుగు ద పాలుగా పూర్తి చేశారన్నారు భట్టి విక్రమార్క.

  Lover Kills Family: ప్రేమోన్మాది ఘాతుకం.. తండ్రితో సహా ఇద్దరు కూతుళ్ల హత్య..

ఏడు లక్షల కోట్ల అప్పులతో అధికారం చేపట్టిన మనం రెండు లక్షల రుణమాఫీనీ నెలల వ్యవధిలోనే అమలు చేస్తున్నామని, ఆర్థిక ఇబ్బందులు ఉన్న.. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే ఐదు హామీలు అమలు చేస్తున్నాము. అయితే అనుకున్నంతగా ఈ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రచారం జరగడం లేదన్నారు భట్టి విక్రమార్క. పార్లమెంటు ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటిస్తే అంతా ఆశ్చర్యపోయారు. సీఎం సవాల్ ఓట్ల కోసమే.. ఎన్నికల సవాల్ అనుకున్నారు.. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ.. రూపాయి రూపాయి పోగుచేసి రుణమాఫీని అమలు చేయబోతున్నామన్నారు. కాంగ్రెస్ నేతలందరికీ పెద్ద ఎత్తున ఉపయోగపడే కార్యక్రమం రుణమాఫీ. చెప్పిన మాట ప్రకారం చేస్తున్నామని ప్రతి గ్రామానికి కాంగ్రెస్ నాయకులు వెళ్లాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుంది.. అని వివరించి రైతులు ప్రజల హృదయాలు గెలవాలన్నారు భట్టి విక్రమార్క.

 Nara Lokesh Saved AP Man: మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. కువైట్ నుంచి సొంత గ్రామానికి చేరుకున్న శివ