Bhatti Vikramarka: టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా తనకు స్ఫూర్తి దాయకులని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హోటల్ తాజ్ కృష్ణలో ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడ రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకాన్ని మాజీ కేంద్ర మంత్రి ఎం.ఎం పల్లంరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు మధుయాష్కి గౌడ్ తో కలిసి భట్టి ఆవిష్కరించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా రచన చేసిన ప్రపంచానికి కొత్త రూపం ఇద్దాం కదలిరండి అనే పుస్తకం దేశంతో పాటు సమాజాన్ని మార్చి వేస్తుందన్న నమ్మకం ఉన్నదని తెలిపారు. ఆర్థిక అసమానతలు పెరగడం వల్ల సమాజానికి మంచిది కాదని ఇంక్లీజీవ్ గ్రోత్ బయట ఉన్న ప్రజలను ఇంక్లీజీవ్ గ్రోత్ లోకి తీసుకురావాలని ఈ పుస్తకంలో చాలా విశ్లేషణాత్మకంగా చెప్పారు. సమాజ హితం కోసం వారు చేస్తున్న రచనలు చాలా స్ఫూర్తిదాయకం చైతన్యవంత మైనవన్నారు.
కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా ప్రజల ఆశలు ఆకాంక్షలు కలలు నెరవేరలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న కలలు ఆశలు నెరవేర్చడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రజల కలలు ఆశలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి సాంకేతికంగా, మేధో పరంగా మద్దతు సహకారం అందించాలని శ్యామ్ పిట్రోడా గారికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. టెలి కమ్యూనికేషన్ విప్లవానికి నాంది పలికిన ప్రముఖ రచయిత శ్యామ్ పిట్రోడా నాకు స్ఫూర్తి దాయకులన్నారు. మనందరి ప్రియతమ నాయకులు దివంగత ప్రధాని రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో టెలి కమ్యూనికేషన్ రంగాన్ని తీసుకువచ్చేందుకు అమెరికాలో ఉన్న శ్యామ్ పిట్రోడా గారి మేధస్సును గుర్తించి అడ్వైజర్ గా సేవలు తీసుకున్నారని అన్నారు. మనుషుల మధ్య ఉన్న దూరాన్ని చాలా దగ్గరగా తీసుకురావడానికి టెలి కమ్యూనికేషన్ ద్వారా భారీ విప్లవాన్ని శ్యామ్ పిట్రోడా తీసుకొచ్చారని తెలిపారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థిగా చదువుతున్న సమయంలో తన ఇంటికి ఫోన్ చేయడానికి జనరల్ పోస్ట్ ఆఫీస్ లో ట్రంక్ కాల్ బుక్ చేసి గంటల తరబడి నిరీక్షించి ఫోన్ చేసి మాట్లాడేవారని గుర్తుచేసుకున్నారు. ఫోన్ చేయడానికి గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి నుంచి ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎవరితోనైనా క్షణాల్లో ఫోన్ చేసుకుని మాట్లాడే సౌకర్యం ఇప్పుడు వచ్చింది అంటే దానికి శామ్ పిట్రోడా చేసిన కృషి అని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తనకు పార్టీలోని అనుబంధ సంఘాల బాధ్యతలు అప్పగించారని అన్నారు. అనుబంధ సంఘాల కమిటీలు వేయడానికి అమెరికాలోని 20 నగరాల్లో ఎన్ఆర్ఐ సెల్ కమిటీలు వేస్తున్న క్రమంలో చికాగో నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి శ్యామ్ పిట్రోడా గారు హాజరు కావడం, ఆరోజు ఆయనతో ఆ సమావేశంలో పాల్గొనడం నా జీవితంలో గొప్ప విషయంగా నిలిచిపోయిందని తెలిపారు.
Golden Globes 2024: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. ఓపెన్‌హైమర్‌కు ఐదు అవార్డులు!