CM Revanth Reddy: ఢిల్లీ టు దావోస్ వయా మణిపూర్.. సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పదిరోజుల పాటు బిజీ బిజీగా ఉండనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉదయం శంషాబాద్ విమానశ్రయం నుంచి బయలుదేరిన సీఎం రేవంత్ కొద్దిసేపటి క్రితం ఢీల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో పార్టీ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. అనంతరం రాహుల్ గాంధీతో మణిపూర్ వెళ్లి భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆతరువార తిరిగి ఢిల్లీకి చేరుకుని అక్కడి నుంచి నేరుగా స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. నాలుగైదు రోజులు అక్కడే ఉండి మరో మూడు రోజులు లండన్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రతి సంవత్సరం స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగనున్న విషయం తెలిసిందే.. వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు, బహుళజాతి కంపెనీల అధినేతలు, పెట్టుబడిదారులు హాజరవుతున్నారు.
Read also: Aaron Finch: క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆరోన్ ఫించ్.. జెర్సీ నెంబర్ 5కి రిటైర్మెంట్! ఇదే తొలిసారి
Also Read
- Mir Alam Lake : మిర్ ఆలం చెరువుకు మహర్దశ.. హైదరాబాద్‌లో కొత్త టూరిజం హబ్
- Harish Rao : హనుమకొండలో హైటెన్షన్.. ధర్నా తర్వాత హరీశ్ రావు అరెస్ట్..
- Nepal Floods: నేపాల్ వరదల్లో 140 మంది తెలుగు యాత్రికులు గల్లంతు.. కుటుంబాల్లో తీవ్ర ఆందోళన
- Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా, కుమారమంగళం బిర్లా, గౌతమ్ అదానీ… వంటి పారిశ్రామికవేత్తలు ఈ సదస్సుకు భారత్ నుంచి హాజరుకానున్నారు. ఈ సదస్సులో కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొని తమ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఈ నెల 15 నుంచి 18 వరకు దావోస్‌లో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. తెలంగాణకు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే ఉద్దేశంతో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు, లండన్ పర్యటనలో పాల్గొంటున్నారు. సీఎం రేవంత్‌తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎంవో కార్యదర్శులు, ఓఎస్డీ తదితరులు దావోస్ పయనం కానున్నారు.
పది రోజుల తర్వాత సీఎం రేవంత్ నేతృత్వంలోని బృందం ఈ నెల 23న హైదరాబాద్‌కు రానుంది. ఆయన ముఖ్యమంత్రిగా పాలన చేపట్టి నెల రోజులు పైనే కావస్తోంది. అయితే రేవంత్ రెడ్డి హడావిడి షెడ్యూల్ తో బిజీగా ఉన్న పెట్టుబడుల విషయంలో తెలంగాణను నిర్లక్ష్యం చేయకూడదని భావిస్తున్నట్లు తెలుస్తుంది. దావోస్ అంతర్జాతీయ పెట్టుబడి సదస్సులో తెలంగాణ ప్రతినిధులు ప్రతిసారీ పాల్గొంటారు. ఈసారి మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో వెళ్లాలన్నారు. కీలకమైన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పటికీ.. పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు.
Dr Preethi suicide case: పీజీ విద్యార్థి సస్పెన్షన్ రద్దు.. హైకోర్టు ఉత్తర్వులు
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్‌లో హృదయవిదారక పరిస్థితులు.. ఆత్మీయుల జాడ తెలియక అరణ్యరోదన
-
ICC: స్టార్ క్రికెటర్‌కు భారీ షాక్.. డోపింగ్ కేసులో 15 నెలల బ్యాన్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
-
Nepal Floods: జల ప్రళయం.. భోటెకోషి విపత్తులో 100 మంది చైనీయులు గల్లంతు..
ట్రెండింగ్
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!
-
Guinness World Record: లక్ష అడుగుల ఎత్తు నుంచి ఫోన్‌ను పడేసినా.. ఒక్క గీత కూడా పడలేదు.! అసలు మ్యాజిక్ ఏంటంటే?