Site icon NTV Telugu

Bhakthi Tv Koti Deepotsavam 2022: రేపటినుంచి భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రారంభం

Koti Deepotsavam 22

Koti Deepotsavam 22

Bhakthi Tv Koti Deepotsavam: కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ నిర్వహించే కోటి దీపోత్సవం మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో 15 రోజుల పాటు ఈ మహా వైభవంగా జరగనుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 14 వరకూ 15 రోజుల పాటు ఈ ఆధ్మాత్మిక సంరంభం ప్రారంభం అవుతుంది. తెలుగు రాష్ట్రాలనుంచే కాక దేశంలోని ప్రముఖ మఠాధిపతులు ఈ కోటి దీపోత్సవంలో పాల్గొంటారు. ఈ కోటి దీపోత్సవం ప్రవచనంతో మొదలై, ప్రత్యేక అర్చనలు, దేవదేవుల కల్యాణ మహోత్సవాల వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో అతి వైభవంగా జరుగుతాయి. ఈ అద్భుత ఆధ్మాత్మిక వేడుకకు ఎన్టీఆర్ స్టేడియం వేదిక కానుంది. భక్తి టీవీ నిర్వహించే కోటిదీపోత్సవానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎన్టీవీ,భక్తీ టీవీ అధినేత న‌రేంద్ర చౌద‌రి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలంటే పకడ్బందీ ప్రణాళిక, సాధనా సంపత్తి అవసరం.

Read Also: Gujarat Cable Bridge Collapse: కేబుల్ బ్రిడ్జ్ కూలిన ఘటనలో 35 మంది మృతి..

కైలాసం భాగ్యనగరానికి తరలి వచ్చిందా అనేంతగా కోటి దీపోత్సవం జరగనుంది. జనం దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళనవసరం లేకుండా శివకేశవులను ఒకేచోట దర్శించుకునే అవకాశం వుంటుంది. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు కోటిదీపోత్సవానికి వస్తుంటారు. నిండైన ఆధ్యాత్మిక ఆనందం, పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్మాత్యిక వేత్తలు తమ సందేశాలతో భక్తులకు దివ్యానుభూతిని కలిగిస్తారు. కోటిదీపోత్సవం అనుభూతిని అక్షరాల్లో చెబితే సరిపోదు… స్వయంగా అనుభవించి తీరాల్సిందే. భక్తిటీవీ కోటి దీపోత్సవానికి వచ్చే భక్త కోటికి ఎన్టీవీ, భక్తిటీవీ, వనిత టీవీ సాదరంగా, మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతోంది.

Read Also: Sri Satya: శ్రీసత్య గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన తండ్రి

Exit mobile version