Singareni Workers: సింగరేణి లో కార్మికులకు ఎల్లో, రెడ్ వార్నింగ్ కార్డులు జారీ చేయడంతో సింగరేణి కార్మకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గని ప్రమాదాలకు కార్మికులను బాద్యులుగా చేసేందుకు యాజమాన్యం కుట్ర చేస్తుందంటూ కార్మిక సంఘాలు మండి పడుతున్నారు. రక్షణ విభాగం ఏరియల వారీగా గనులకు సర్క్యులర్లు పంపించింది. కార్మికులు ఒకసారి తప్పు చేస్తే ఎల్లో (పసుపు )కార్డు , 3 సార్లు తప్పు చేస్తే రెడ్ కార్డు జారీ చర్యలు తీసుకుంటున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. గని ప్రమాదాలకు అక్కడున్న రక్షణ చర్యలు కారణం అయితే.. కార్మికులను బలి చేయడంఏంటని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా ఏ తప్పు జరిగిన అధికారులు ఇక ఎల్లో కార్డు జారీ చేయనున్నారు. చర్చించకుండా అంతర్గతంగా సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసిందంటు కార్మిక సంఘాల మండిపడుతున్నాయి. ఎల్లో ,రెడ్ కార్డ్స్ ను రద్దు చేయాలంటూ యాజమాన్యానికి కార్మిక సంఘాల లేఖలు పంపారు.
Read also: Traffic Challans: హెల్మెట్ లేకుండా బైక్ నడిపినందుకు 11.5 లక్షల చలాన్లు..!
గతంలో గనిలో కార్మికుడు తప్పు చేస్తే విచారణ జరిపి తప్పు రుజువైతే చార్జిషీటు వేయడమో, మరేదైనా చర్యలు తీసుకోవడమో చేసేవారు. డీజీఎంఎస్ విచారణ కూడా జరిగింది. యాజమాన్యం ఇలాంటి విచారణలకు స్వస్తి పలికింది. సింగరేణిలో పనిచేస్తున్న కార్మికుల్లో నిరుద్యోగులు కూడా ఉన్నారు. సెల్ ఫోన్లలో వచ్చే మెసేజ్ లు చదవకుంటే యాజమాన్యం చర్యలు తీసుకునే వరకు కూలీకి తెలియని పరిస్థితి నెలకొంది. పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు, రక్షణ పరికరాలు కల్పించకుండా తప్పు చేసిన కార్మికునిపై పసుపు, ఎరుపు కార్డులు తీసుకురావడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read also: Child Selling: కన్న కూతురిని లక్ష రూపాయలకు అమ్మిన కసాయి తండ్రి..
కార్మికులకు సరైన రక్షణ పరికరాలైన బూట్లు, హెల్మెట్‌లు తదితరాలు అందజేయక, కాలం చెల్లిన యంత్రాలతో పని చేస్తుంటే ప్రమాదాలు ఎలా నివారించగలం? దీనికి కార్మికుడిని బాధ్యులను చేయడం ఎంతవరకు సమంజసం? అని ప్రశ్నిస్తున్నారు. అధికారుల పదోన్నతులు, ఆర్థిక ప్రయోజనాల కోసం కార్మికులు బలిదానాలు చేస్తున్నారు. రెడ్ కార్డ్ ఉన్న ఉద్యోగిపై ఛార్జిషీటుతో పాటు సస్పెన్షన్, ఇంక్రిమెంట్ కోత, తొలగింపు వంటి తీవ్రమైన క్రమశిక్షణా చర్యలకు యాజమాన్యం సిద్ధమవుతోంది. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ సంఘాలు యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. పసుపు, ఎరుపు కార్డుల విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. లేనిపక్షంలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని తెలిపారు.
Kishan reddy: ఆ రెండు పార్టీలు కవల పిల్లలు.. కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు