NTV Telugu Site icon

Bhadrachalam: గోదావరికి వరదలు.. గోదావరిలోకి భక్తులను అనుమంతించని పోలీసులు..

Bhadrachalam

Bhadrachalam

Bhadrachalam: గోదావరి పరివాహక ప్రాంతంలో వరదల వల్ల దాని ప్రభావం భద్రాచలంలోని సీతారామ చంద్రస్వామి దేవాలయంపై పడింది. సీతారామచంద్రస్వామి దేవాలయానికి భక్తుల రాక భారీగా తగ్గింది. గత శనివారం నుంచి భద్రాచలం కి పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల వల్ల గోదావరి వరద వచ్చింది. భద్రాచలం వద్ద మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసిన విషయం తెలిసిందే .ఈ నేపథ్యంలో భద్రాచలం స్వామివారికి దర్శించుకునేందుకు భక్తుల తాకిడి తగ్గింది. శని, ఆది,సోమవారం కూడా సెలవు దినం అయినప్పటికీ భక్తులు మాత్రం భద్రాచలంకి రావడం లేదు.

Read also: Uppu Kappurambu: డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కాబోతున్న కీర్తి సురేష్‌ ఉప్పు కప్పురంబు

ప్రధానంగా గోదావరి వస్తున్న వరద వార్తలే కారణం. గోదావరికి వరద వల్ల కరకట్ట వద్ద ఉన్న స్నాన ఘట్టాలు కూడా పూర్తిగా మునిగిపోయాయి. వరద వల్ల గోదావరిలోకి భక్తులు వెళ్లి స్నానాలు చేయటానికి కూడా పోలీసులు అంగీకరించడం లేదు ప్రమాదవశాత్తు గోదావరిలో పడతారని ఆందోళనతో గోదావరి స్థాన ఘట్టాల వైపు భక్తుల్ని అనుమతించడం లేదు. భద్రాచలం వద్ద గోదావరి 51.90 అడుగులకు చేరింది. సుమారు 13,66,298 క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతుంది. గోదావరికి రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.

Read also: Lal Darwaja Bonalu: ప్రారంభమైన లాల్‌ దర్వాజా బోనాలు.. బోనం ఎత్తిన పాత బస్తీ..

కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి కొనసాగుతున్న 20 వేల క్యూసెక్కులకి పైగా ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు కడెం ప్రాజెక్ట్ నుంచి కూడా నీటిని వడలడంతో ఇన్ ఫ్లో పెరిగింది. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20 టీఎంసీలు.. ప్రస్తుత నిల్వ 17 టీఎంసీలు. ఇక నిన్న సాయంత్రం ఎత్తిపోతల అధికారులు ప్రారంభించారు. నంది మేడారం, నంది పంప్ హౌజ్, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌజ్ ల నుంచి అధికారులు నీటిని లిఫ్ట్ చేస్తున్నారు. మధ్య మానేరుకు చేరిన ఎల్లంపల్లి నీరు. మధ్యమానేరు జలాశయం పూర్తి సామర్ధ్యం 27 టీఎంసీలు, ప్రస్తుతం ఏడు టీఎంసీలకు చేరిన నీటి మట్టం కొనసాగుతుంది.
Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?