NTV Telugu Site icon

TS Congress: పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం..

Congress

Congress

భద్రాచలంలో ప్రతిష్ఠాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు ఫాంహౌస్ లు కట్టుకున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. అదేవిధంగా.. భద్రాచలం దేవస్థానంను అభివృద్ధి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. మీరందరూ మంచి మెజారిటీతో బలరాం నాయక్ ను గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు.

Read Also: Bhatti Vikramarka: సీతారామచంద్ర సన్నిధిలో కాంగ్రెస్ ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుట్టింది..

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎప్పుడు పేదల పక్షం.. పేదల కళ్ళల్లో ఆనందం చూడడమే కాంగ్రెస్ లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రతి గారంటీని పేదలకు అందిస్తామని తెలిపారు. గతంలో ఆర్టీసీ రెట్లు పెంచితే.. కాంగ్రెస్ మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తుందని పేర్కొన్నారు. శ్రీరామ చంద్రుడు ఆలయం వద్ద చెబుతున్నాం… హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి సీతక్క చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. సాక్షాత్తు భద్రాద్రి రాముడి సమక్షంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. మొందికుంట ప్రాజెక్ట్, పాలెం వాగు ప్రాజెక్ట్, పగల్లపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ కు.. సీతారామ ద్వారా జిల్లా మొత్తం నీళ్ళు ఇచ్చే ప్రక్రియ చేపడుతామన్నారు. అంతేకాకుండా.. కరకట్టను పూర్తి చేయడం కోసం కృషి చేస్తామని తెలిపారు. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన అప్పులున్నప్పటికి అన్నింటినీ నెరవేరుస్తామని హామీ ఇస్తామని అన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి, రోశయ్య ఇచ్చిన విధంగా భట్టి ఇవ్వాలని కోరుతున్నాం.. మీ ముందు శభాష్ అనిపించుకుంటాం.. తప్ప ఛీ ఛీ అనిపించుకోమన్నారు.

Read Also: Electoral Bonds: ఎలక్టోరల్‌ బాండ్‌ అంటే ఏమిటీ?.. వాటిని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసింది?

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం అయిన ఇళ్ల పథకం అమలు అవుతుందని తెలిపారు. రాముల వారికి ఇస్తానన్న వంద కోట్లు కూడా ఇవ్వకుండ కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. ఇది చేతల ప్రభుత్వం.. గతంలో పింక్ షర్ట్ లు తీసుకున్న వారికే పథకాలు వచ్చాయని పేర్కొన్నారు. ఇప్పుడు ఏ పథకం అలా ఉండదని మంత్రి పొంగులేటి తెలిపారు.