NTV Telugu Site icon

Godavari River: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి.. నీటిమట్టం 50 అడుగులు..

Godavari

Godavari

Godavari River: ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల భద్రాచలం వద్ద మరోసారి గోదావరి నీటిమట్టం పెరుగు తుంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్ట 51.10 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరొక రెండు అడుగులు నీటిమట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు అధికారులు. ఇప్పటికే భద్రాచలం నుంచి ఎగువ ప్రాంతాలకు దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల చర్ల, వాజేడు ,వెంకటాపురం, అదేవిధంగా భద్రాచలం నుంచి ఆంధ్ర ప్రాంత విన కూనవరం చింతూరు ప్రాంతాలకి రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా గత వారం రోజుల నుంచి గోదావరీ పెరుగుతూ తగ్గుతూ వస్తుంది. తాజాగా వారం రోజుల వ్యవధి లో గోదావరి మూడుసార్లు రెండవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహించింది. ఇది మరింత పెరిగి మూడవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read also: Madanapalle Sub Collector Office Case: మదనపల్లె సబ్ కలెక్టరేట్‌ ఘటనలో కీలక పరిణామం..

ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది బూర్గంపాడు మండలంలో పునరావస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాగా.. 53 అడుగులకు వస్తే మూడో ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేయనున్నారు. ఛత్తీస్ ఘడ్, ఒడిస్సా రాష్ట్రాల నుంచి భారీగా వరద అంతా శబరి మీద పడింది. శబరి నీటి ప్రవాహం వేగంగా పెరిగింది. తాజాగా.. శబరి 40 అడుగులకు చేరుకోవడంతో అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరిక ప్రారంభమైంది. దీంతో గోదావరి వరద కాస్త తగ్గింది. భద్రాచలం వద్ద గోదావరి కొద్ది మేరకు పెరుగుతున్నది. ఇది మరింత పెరిగి రెండో ప్రమాద హెచ్చరిక స్థాయి వరకు వస్తుందని అంచనా వేస్తున్నారు. దీంతో ముందస్తు హెచ్చరికల్ని ఇప్పటికే అధికారులు జారీ చేశారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
Liquor Shops Closed: 28, 29 తేదీల్లో హైదరాబాద్ లో వైన్ షాపులు పూర్తిగా బంద్..