NTV Telugu Site icon

Godavari River: శాంతించిన గోదావరి.. నీటిమట్టం 33 అడుగులు

Godavari River

Godavari River

Godavari River: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 33 అడుగులుగా ఉంది. గంటకి ఒక పాయింట్ చొప్పున పది గంటలకు ఒక్క అడుగు గోదావరి నీటిమట్ట తగ్గుతుంది. ఎగువన గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు లేకపోవడం వల్ల అదే విధంగా దిగువన వున్న శబరి దగ్గర కూడా వరద లేకపోవడం వల్ల గోదావరిలో నీరు వేగంగా పోలవరం వెళ్తుంది. పోలవరం నుంచి ధవళేశ్వరం. మీదుగా సముద్రం లో కలుస్తోంది.. గత నెల 21వ తారీకు నుంచి గోదావరి పెరగటం ప్రారంభించింది. ఏటా జూలై, ఆగస్టు నెలలో గోదావరి వరదలు వస్తుంటాయి. అయితే ఆగస్టులోనే ఎక్కువగా గోదావరి వరదలు వస్తుంటాయి ..కానీ ఈసారి జూలై నెలలో వరదలు వచ్చాయి. గత నెల 23వ తేదీన 51.5 అడుగులకు వచ్చిన గోదావరి ఆ తర్వాత తగ్గుముఖం పట్టి 44 అడుగుల దగ్గర ఉండి మళ్లీ పెరిగింది 53.9 అడుగులకి గోదావరి పెరిగింది. దీంతో మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అయితే ప్రస్తుతం గోదావరి నీటిమట్టం పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టింది. 43 అడుగుల చేరుకుంటే మొదటి ప్రమాదం జారీ చేస్తారు. మొదటి ప్రమాద హెచ్చరిక కి ఇంకా 10 అడుగుల దూరంలో ప్రస్తుతం గోదావరిలో నీటిమట్టం ఉంది.

Read also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే?

భద్రాచలం గోదావరి వద్ద ఇరువైపులా బ్యారేజీల నిర్మాణంపై ఉన్నతాధికారులు సమాలోచనలు జరుపుతున్నారు. భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గురువారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందించిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేశారు. జలవనరుల శాఖ సర్వేలు ఏడాది క్రితమే పూర్తయ్యాయి. 85 కి.మీ. పొడవైన కట్టల నిర్మాణానికి రూ.4,300 కోట్లు అవసరమని అధికారులు గుర్తించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయనున్న సంగతి తెలిసిందే. భద్రాచలం వైపు 35 కి.మీ. పొడవైన కట్టకు రూ.1,850 కోట్లు అవసరం. సుభాష్ నగర్ కాలనీ నుంచి దుమ్ముగూడెం మండలం సున్నంబట్టి వరకు కట్టలు నిర్మించాలని ప్రతిపాదించారు.

Read also: Paris Olympics 2024: భారత బ్యాడ్మింటన్‌లో చరిత్రాత్మక విజయం.. క్వార్టర్ ఫైనల్స్‌కు లక్ష్యసేన్

బూర్గంపాడు మండలం సంజీవరెడ్డిపాలెం నుంచి అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వరకు పినపాక వైపు 50 కి.మీ. పొడవైన ఎత్తిపోతల కోసం రూ.2,450 కోట్లు కేటాయించాల్సి ఉందని అంచనా. ఎటపాక, తురుబాక, కిన్నెరసాని, తాలిపేరు తదితర ప్రాజెక్టుల వరద గోదావరిలో కలిసే ప్రదేశాల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యల గురించి ప్రణాళికలో పొందుపరిచారు. పోలవరం ముంపునకు గురైనా.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా గరిష్ఠ వరదను పరిగణనలోకి తీసుకుని సర్వే చేశారు. ఈ నిధులతో భద్రాచలంలోని విస్టా కాంప్లెక్స్, కొత్త కాలనీ వంటి ప్రాంతాల్లో ముంపు సమస్యను నివారించేందుకు బాహుబలి మోటార్స్‌ను వినియోగించనున్నారు. కొత్త ఎత్తిపోతల నిర్మాణంతో పాటు భద్రాచలం నుంచి ఎటపాక వరకు ఉన్న పాత కరకట్ట సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంది. కొంతకాలం క్రితం గోదావరి ఎత్తిపోతల నిర్మాణాలను ఉన్నతాధికారులు పరిశీలించి సర్వే నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. తదుపరి చర్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Astrology: ఆగస్టు 03, శనివారం దినఫలాలు