భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో కొలువుతీరి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి..ముగింపు రోజు సందర్భంగా అమ్మవారు నిజరూప మహాలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.విజయ దశమి వేడుకలలో భాగంగా శ్రీరామ మహపట్టాభిషేకం,సాయంత్రం శమీ పూజ,ఆయుధ పూజ,శ్రీరామలీల ఆలయ అధికారులు నిర్వహించారు. రాజులందరూ కూడా విజయదశమి నాడు జమ్మి చెట్టును విజయలక్ష్మిగా భావించి తాము వినియోగించే సకల రకాల ఆయుధాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
దసరా పండుగ సందర్భంగా రామాలయం నుంచి ఉత్సవ మూర్తులను,స్వామివారి ఆయుధాలను వూరేగింపుగా మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చారణలనడుమ తీసుకొచ్చి దసరా మండపంలో స్వామివారిని ఆశీనులని చేసి,శమీవృక్షం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క బాణాన్ని అర్చక స్వాములు వదలడం దుష్ట గ్రహాలు నశించడమే కాకుండా దేశం సుఖసంతోషాలతో భోగభాగ్యాలతో విరాజిల్లాలనే ఉద్దేశ్యం.జమ్మి చెట్టుకు భక్తులు తమ మనసులోని కోరిక ను ఒక కాగితం మీద రాసి చెట్టుకొమ్మలకు కట్టి నమస్కరిస్తారు. జమ్మి ఆకును పెద్దల చేతుల్లో పెట్టి వారి ఆశీర్వాదం పొందుతారు.అర్చకులు స్వామివారికి నివేదన,ఆరాధన గావించారు.
Read Also: HD Kumaraswamy: కేసీఆర్ విజనరీ, ఛాలెంజింగ్, లెజెండరీ లీడర్
రావణ దహన కార్యక్రమం కూడా వైభవంగా నిర్వహించారు. అనంతరం పది తలల రాక్షసుడు రావణాసురుడుపై ఆలయ ఈఓ శివాజీ బాణాన్ని సంధించి రావణుణ్ణి వధించి శ్రీరామలీల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం భక్తులు ఆసక్తిగా తిలకించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు భక్తులకు అందచేశారు.
Read ALso: Winston Benjamin: విరాట్ గొప్ప కెప్టెన్ కాదు.. విండీస్ మాజీ క్రికెటర్ బాంబ్