Hit & Run Case: తార్నాకలో హిట్ & రన్.. ఆటోని ఢీకొన్న బెంజ్ కారు.. యజమాని పరార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Benz Car Hit And Run Case in Hyderabad Tarnaka: హైదరాబాద్‌లోని తార్నాక ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అత్యంత వేగంగా వచ్చిన ఓ బెంజ్ కారు, ఒక ఆటోని ఢీకొంది. ఈ ఘటనలో వృద్ధుడైన ఆటో డ్రైవర్ దశరథ్ తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. బెంజ్ కారు వేగంగా ఢీకొనడంతో.. దశరథ్ ఆటో పక్కనే ప్రయాణిస్తున్న మరొక ఆటోని ఢీకొట్టింది. అందులో మొత్తం ఐదుగురు ప్రయాణికులు ఉండగా.. నలుగురికి గాయాలయ్యాయి. అయితే.. ఆ వృద్ధుడే చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తన ఆటో వద్దకు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆ బెంజ్ కార్ ఢీకొట్టడంతో.. ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదానికి కారణమైన బెంజ్ కార్ యజమాని, ప్రమాదం జరిగిన వెంటనే పారిపోయాడు. ఈ ఘటన నిన్న ఉదయం 6 గంటల 15 నిమిషాల సమయంలో జరిగింది.
Uncontrolled Car : అతివేగంగా వెళ్లి స్థంభాన్ని ఢీకొట్టి.. బాంబులా పేలిన కారు
Also Read
- Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణపతి వద్ద పెరిగిన భక్తుల రద్దీ.. డీసీపీ కీలక వ్యాఖ్యలు..
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- Hyderabad: దారుణం.. హైదరాబాద్‌లో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్.. మూడు రోజులపాటు 9 మంది లైంగిక దాడి..
- Heavy Rain: వినాయకచవితి వేళ కరుణించిన వరుణుడు.. రాష్ట్రవ్యాప్తంగా దంచికొడుతున్న వర్షాలు
ఈ ఘటనపై దశరథ్ కుటుంబ సభ్యులు, ఆటో బాధితులు మాట్లాడుతూ.. తార్నాక టీ జంక్షన్ వద్ద ఓ బెంజ్ కారు ఒక ఆటోని ఢీకొట్టిందని తెలిపారు. అయితే.. బెంజ్ కారు ఆపకుండా, కారుతో యజమాని ఎస్కేప్ అయ్యాడని వెల్లడించారు. ఆటో డ్రైవర్ దశరథ్ తలకు గాయం అవ్వడంతో, ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడన్నారు. ఈ ఘటన జరిగిన 24 గంటలు గడిచినా.. పోలీసులు ఇంతవరకూ యాక్షన్ తీసుకోలేదని మండిపడుతున్నారు. ఇంకా గాలిస్తూనే ఉన్నామంటూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశరథ్ది పేద కుటుంబమని, ఆటో నడిపి జీవనం కొనసాగిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో దశరథ్ ఆటో మరో ఆటోని ఢీకొనడంతో, అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. మొత్తం రెండు ఆటోలు డ్యామేజ్ అయ్యాయన్నారు. పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ బెంజ్ కారు యజమానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
RRR: చరణ్ బర్త్ డే వేడుకల్లో ఆర్ ఆర్ ఆర్ టీంకి ‘చిరు’ సన్మానం…
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!