NTV Telugu Site icon

Beer Sales: ఏం తాగార్రా నాయనా.. 18 రోజులు 23 లక్షల కేసుల బీర్లు..

Bear Sales

Bear Sales

Beer Sales: ఒకవైపు సూరీడు మండిపోతున్నాడు. తెలంగాణలో ఎండలు ఏ రేంజ్‌లో విజృంభిస్తున్నాయో తెలియంది కాదు.. ఉదయం 9 గంటలు దాటితే నిప్పుల కొలిమిలా తయారైంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. సాయంత్రం 07 గంటల వరకు కూడా వేడి ఏమాత్రం తగ్గకపోవడంతో ప్రజలు కూలర్లు, ఫ్యాన్లు, ఏసీలకు అతుక్కుపోతున్నారు. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఉక్కపోత.. వీటి నుంచి సేద తీరేందుకు మద్యం ప్రియులు చిల్డ్‌ బీర్‌ కావాలంటున్నారు. గత కొన్నాళ్ళుగా ఎండలు ఎక్కువవటంతో బీర్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది ఏప్రిల్‌తో పోల్చితే ఈ సారి ఏకంగా 90 శాతం అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.

Read also: Vijayasai Reddy: ఇచ్చిన డబ్బులు తీసుకోండి.. వైసీపీకి ఓటు వేయండి..

తాజాగా ఎక్సైజ్ అధికారులు తెలిపిన లెక్కల ప్రకారం.. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు మందు బాబులు రూ.670 కోట్లు విలువైన 23 లక్షల కేసుల బీర్ రాష్ట్రవ్యాప్తంగా తాగేశారు. ఇది ఆల్ టైమ్ రికార్డు అని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. గతేడాది ఇదే నెలతో పోలిస్తే బీర్ల విక్రయాలు 28.7% పెరిగాయని చెబుతున్నారు. గత 15 రోజులుగా బీర్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో అమ్మకాలు మరింత తగ్గాయని.. లేదంటే పెరిగేదని చెబుతున్నారు. వర్షం ప్రభావం లేకపోవడంతో బీర్ల కొరత ఏర్పడిందని వాపోతున్నారు. ఈ నెలలోనే ఇలా ఉంటే వచ్చే నెలలో బీర్ల విక్రయాలు మరింత ఎక్కువగా ఉంటాయని లెక్కలు చెబుతున్నాయి. సాధారణంగా తెలంగాణలో మద్యం విక్రయాలు ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలం అయితే మరీ.. కాకపోతే ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బీర్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.
Mainpuri Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మహిళలు మృతి.. 24 మందికి గాయాలు