NTV Telugu Site icon

Beer Sales: పెరిగిన ఉష్ణోగ్రతలు.. బీర్లకు ఫుల్‌ డిమాండ్‌..!

Beer Sales

Beer Sales

వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు లిక్కర్‌ అమ్మకాలపై ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాయి.. కొన్ని భయాలు కూడా.. లిక్కర్‌, బీర్ల సేల్స్‌ను ప్రభావితం చేస్తాయి… అయితే, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితి కొంత మారింది… కూల్‌గా బీర్లు లాగించేవారు కూడా.. క్రమంగా వైన్‌, బ్రాండీ సేవించారు.. అయితే, ఇప్పుడు మళ్లీ పరిస్థితి మారింది.. కరోనా భయాలు తొలగడంతో.. ఎండల తీవ్రత పెరడగంతో తెలంగాణలో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి.. ఉష్ణోగ్రతలు పెరగడంతో లిక్కర్కంటే బీర్లకు డిమాండ్ పెరిగిపోయింది.. మార్చి నుంచి మే 14వ తేదీ వరకు అంటే 75 రోజుల్లో రూ.6,702 కోట్ల విలువైన 10.64 కోట్ల లీటర్ల బీర్లుతో పాటు 6.44 కోట్ల లీటర్ల లిక్కర్‌ను లాగించారు మందుబాబులు.. అంటే, లిక్కర్‌తో పోలిస్తే బీర్ల అమ్మకాలు అమాంతం పెరిగిపోయాయి.. దాదాపు 4 కోట్ల లీటర్ల బీరు అధికంగా తాగిసినట్టే రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

Read Also: Kangana Ranaut: ‘మా’ ప్రెసిడెంట్ కు థాంక్స్ చెప్పిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. ఎందుకంటే..?

అయితే, గతంలోనూ వేసవి వచ్చిందంటే చాలు బీర్లకు ఫుల్‌ డిమాండ్‌ ఉండేది.. కానీ, కరోనా ఎంట్రీ తర్వాత పరిస్థితి మారిపోయింది.. కూల్‌గా బీర్లు తాగితే కరోనా వస్తుందన్న ప్రచారం తెరపైకి రావడంతో.. మందుబాబులు ఓ దశలో వణికిపోయారు.. లిక్కర్‌ తాగకుండా బీర్లు మాత్రమే తాగేవారు సైతం.. బీర్లకు బైబై చెప్పేసి.. లిక్కర్‌ స్టార్ట్‌ చేవారు. కానీ, కరోనా ముగింపు దశకు చేరుకోవడంతో మళ్లీ కూల్‌గా తాగేందుకు మొగ్గుచూపుతున్నారు.. దీనికి నిదర్శనం ఎక్సైజ్‌శాఖ గణాంకాలే.. ఎందుకంటే.. గత ఏడాది కంటే బీర్ల అమ్మకాలు భారీగా పెరిగాయి.. ఈ ఏడాదిలో ఎండల తీవ్రత మొదలైనప్పట్టి నుంచి మద్యం అమ్మకాలను జిల్లాల వారీగా పరిశీలిస్తే.. రంగారెడ్డి జిల్లా తొలిస్థానంలో ఉండగా.. వరంగల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది.. రంగారెడ్డి జిల్లాలో 2.38 కోట్ల లీటర్ల బీర్లు తాగితే.. తర్వాతి స్థానంలో ఉన్న వరంగల్లో కోటి 15 లక్షల లీటర్ల బీర్లు లాగించేశారు మద్యం ప్రియులు.. అయితే, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుండడంతో కూడా మద్యం అమ్మకాలు పెరగడడానికి కారణం అవుతోంది.