NTV Telugu Site icon

Banks Holidays : నేటి నుంచి ఐదు రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు

Bank Holidyes

Bank Holidyes

Banks Holidays: ఈ నెలలో బ్యాంకులకు 15 రోజులు సెలవులు ఉంటాయి. వారాంతపు సెలవులతో కలిపి మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. దీంతో ఏప్రిల్ నెలలో పదిహేను రోజుల పాటు బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. వినియోగదారులు ఈ సెలవుల ప్రకారం ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అయితే పదిహేను రోజుల సెలవుల్లో నేటి నుంచి వరుసగా ఆరో రోజు తప్పితే.. మిగిలిన ఐదు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మహావీర్ జయంతి సందర్భంగా ఈరోజు పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు సెలవు. ఇక ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు హాఫ్ డే పని చేయనున్నాయి.

Read also: Forest officials: అటవీశాఖ అధికారులకు సర్కార్‌ గుడ్‌ న్యూస్‌.. వారికి రూ.కోటి వరకు..

అలాగే ఏడో తేదీ గుడ్ ఫ్రైడే, 8వ తేదీ రెండో శనివారం, తొమ్మిదో తేదీ ఆదివారం సందర్భంగా వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు ఖాతా సేవలు నిలిచిపోనున్నాయి. ఈ నెలలో మరో తొమ్మిది రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. రెండవ మరియు నాల్గవ శనివారాలు, 8వ మరియు 22వ తేదీలలో బ్యాంకులు మూసివేయబడతాయి. అలాగే ఈ నెలలో మొత్తం ఐదు ఆదివారాలు ఉన్నాయి. ఇలా ఏప్రిల్‌లో 15 రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగల కారణంగా బ్యాంకులకు అరష్టం వరకు మాత్రమే సెలవులు ఉంటాయని, ఇతర రాష్ట్రాల్లో మాత్రం యథావిధిగా పనిచేస్తాయని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది.
Netherlands Train Accident : నెదర్లాండ్స్ లో ఘోర రైలు ప్రమాదం

Show comments