NTV Telugu Site icon

Nagar Kurnool: సైబర్ నేరగాళ్ల ఉచ్చులో బ్యాంక్ మేనేజర్.. న్యూడ్ ఫోటోతో బ్లాక్ మెయిల్

Cyber Crime

Cyber Crime

Nagar Kurnool:సైబర్ నేరాలు ఆగడం లేదు. రోజూ ఎక్కడో ఒకచోట జరుగుతోంది. అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా… ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. అధ్యాపకులు, ఉద్యోగులు కూడా సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. సైబర్ నేరాలపై కస్టమర్లకు అవగాహన కల్పించి, మోసపోకుండా చూసుకోవాల్సిన ఓ బ్యాంక్ మేనేజర్ సైబర్ క్రైమ్ నేరగాళ్ల బారిన పడ్డాడు. తన ఫోన్‌ కి వచ్చిన మెసేజ్‌ను క్లిక్ చేయడంతో న్యూడ్ ఫోటోలు షేర్ చేస్తామంటూ మేనేజర్‌ని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. దీంతో మేనేజర్ రూ.1లక్ష 56వేలు విడదలవారికిగా పంపిన ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

Read also: AP NDA Leaders: శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు ఎన్నిక.. గవర్నర్కు లేఖ

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పిన్ కేర్ బ్యాంక్ లో కళ్యాణ్ అనే వ్యక్తి మేనేజర్ పనిచేస్తున్నాడు. సోమవారం అతని ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. అదే తన జీవితాన్ని టర్నింగ్ అయ్యేలా చేసింది. ఏం మెసేజ్ అనుకున్నాడో ఏమో గానీ మెసేజ్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అందులో తన న్యూడ్ ఫోటో ఉంది. దీంతో ఖంకారు పడ్డ బ్యాంక్ మేనేజర్ మెసేజ్ కు రిప్లై ఇచ్చాడు. అంతే కేటుగాళ్ల చేతులో ఇరుక్కుపోయాడు. వాళ్లు మేనేజర్ కు బెదిరించడం మొదలు పెట్టారు.

Read also: Air Pollution : విషపూరిత గాలి పీల్చి 13కోట్ల మంది మృతి.. అధ్వాన్నంగా చైనా, భారత్ పరిస్థితి

దీంతో బెంబేలెత్తిన మేనేజర్ విడదల వారిగా వారికి రూ. 1లక్ష 56వేలు పంపాడు. అయినా సైబర్ కేటుగాళ్లు మేనేజర్ ను వదలలేదు. బ్యాంక్ మేనేజర్ తన కాంటాక్ట్‌లలో ఉన్న 300 మందికి న్యూడ్ ఫోటోలు పంపి మరీ డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో షాక్ తిన్న మేనేజర్ ఇలాగే డబ్బులు పంపితే అలవాటుగా మారుతుందని గ్రహించి చివరకు పోలీసులకు ఆశ్రయించాడు. సోమవారం రాత్రి నాగర్ కర్నూల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మేనేజర్ డీపీ సహాయంతో ఫేక్ న్యూడ్ ఫోటోలు చిత్రీకరించినట్లు వెల్లడించాడరు. ప్రజలు డీపీలు పెట్టే ముండు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
USA vs IND: శివమ్ దూబెపై వేటు.. ఐపీఎల్ స్టార్‌కు చోటు!