SI Saved 16 Members Life: హైదరాబాద్‌లో 16 మంది ప్రాణాలను కాపాడారు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై కరుణాకర్‌రెడ్డి.. ఇవాళ ప్రగతి భవన్ దగ్గర ముట్టడి కార్యక్రమం నిర్వహించింది ఏబీవీపీ.. ఇక, వారిని కట్టడి చేసిన పోలీసులు.. అరెస్ట్ చేసినవారిలో 16 మంది ఓ డీసీఎంలో ఎక్కించారు.. ఆ తర్వాత ప్రగతి భవన్ నుంచి ఖైరతాబాద్ వైపునకు బయల్దేరింది డీసీఎం.. అయితే, డీసీఎం నడుపుతోన్న హోం గార్డు రమేష్ కి అనుకోకుండా ఫీట్స్ వచ్చాయి.. డీసీఎం అదుపుతప్పింది.. డివైడర్ మీదకి దూసుకెళ్లింది.. అక్కడే సమస్ఫూర్తితో పాటు ధైర్య సాహసాలను ప్రదర్శించారు ఎస్సై కరుణాకర్‌రెడ్డి.. డీసీఎంలో వెనుక ఉన్న ఆయన.. డీసీఎం అదుపుతప్పడాన్ని గమనించి వెంటనే కిందకు దూకారు.. ప్రాణాలకు తెగించి ఆ వాహనాన్ని కంట్రోల్ చేశారు.. ఈ క్రమంలో ఆయనకు, డీసీఎంలో ఉన్న కానిస్టేబుల్ సాయికుమార్‌కు గాయాలయ్యాయి.. మొత్తంగా ఎస్సై కరుణాకర్ రెడ్డి చొరవతో 16 మంది ఏబీవీపీ కార్యకర్తలకు ముప్పు తప్పింది.. ఇక, ఎస్సై, కానిస్టేబుల్, హోంగార్డ్‌ను యశోద ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక, సమయ స్ఫూర్తితో పాటు, ధైర్యసాహసాలు ప్రదర్శించిన ఎస్సై కరుణాకర్‌రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.. సెల్యూట్ ఎస్సై సార్ అంటూ.. రియల్ హీరో అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Read Also: Jobs: నిరుద్యోగులకు శుభవార్త.. 1,540 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్..
