NTV Telugu Site icon

Bandi sanjay: మాకు ఎలాంటి విభేదాలు లేవు.. ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారం

Bandi Sanjay

Bandi Sanjay

Bandi sanjay: ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారం తప్ప మాకు ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనం ప్రారంభం – రాష్ట్రపతి ఆహ్వానం వివాదం పై ఆయన స్పందించారు. రాష్ట్రపతిని ఓడగొట్టె ప్రయత్నం చేసి అవమానపరిచింది ఇవే ప్రతిపక్షాలు.. ఇప్పుడు పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అప్పుడు మహిళని చూడకుండా అవమానపరిచి ఇప్పుడు ఇలా రాజకీయం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. స్పీకర్ నిర్ణయం ప్రకారమే ఏ కార్యక్రమైన జరుగుతుందని అన్నారు. తెలంగాణలో జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.. కానీ దశాబ్ధి ఉత్సవాలకు 150 కోట్ల ప్రకటనలు ఇచ్చారని అన్నారు. వైఫల్యాలు చర్చకి రాకండా ఉండేందుకే ఈ ఉత్సవాల పేరుతొ హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ లోను లిక్కర్ దందా జరిగిందని, ఇందులోనూ కేసీఆర్‌ కుటుంబం ఉందేమో అన్న అనుమానాలు వస్తున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఢిల్లీ ,పంజాబ్ లో చేసినవారు తెలంగాణలో చేయలేరా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ లోను లిక్కర్ దందాపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. ఉద్యోగులు, విద్యార్థులు, ప్రజలు ఎవరు సంతోషంగా ఉన్నారని ఈ దశాబ్ది ఉత్సవాలు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే మళ్ళీ అదే BRS కి వెళ్తారని ఎద్దేవ చేశారు. ఇప్పటికి మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా అటో ఇటో అన్నట్టుగా ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే గాంధీ భవన్ లో తప్ప ఎక్కడ సంబరాలు చేసుకునే పరిస్థితి లేదని అన్నారు. ఓ సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారం తప్ప మాకు ఎలాంటి విభేదాలు లేవని అన్నారు. ప్రజలకు పోరాటం చేస్తున్న బీజేపీకి మీడియా యాజమాన్యాలు సహకరించాలని కోరారు. గ్రానైట్ లో నాకు సంబంధం ఉందనడం ఆరోపణ మాత్రమే అని అన్నారు.

గ్రానైట్ తో సంబంధం లేదు అని గతం లోనే అమ్మవారు ముందు ప్రతిజ్ఞ చేశా మళ్ళీ చేయమన్న చేస్తా అని బండి సంజయ్‌ పేర్కొన్నారు. గ్రానైట్ లో ఐదు వందలమంది వ్యాపారులు ఉన్నారని అన్నారు. ఇందులో BRS ,కాంగ్రెస్,బీజేపీ సపోర్టర్స్ కూడా ఉన్నారని ఆరోపించారు. తను డబ్బులు తీసుకుంటే వాళ్ళు బయటకి రాకుండా ఉంటారా !? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ చెయించుకున్న సర్వే ప్రకారం 42 సీట్లు వస్తాయని భయపడి తున్నాడని వ్యంగాస్త్రం వేశారు. 111 జీవో పై కెసిఅర్ గారు చిత్తశుద్ధి ఉంటే ఎవ్వరికి ఎన్ని ఎకారాలు ఉందో శ్వేతపత్రం రిలిజ్ చెయ్యాలని కోరారు. కవిత లిక్కర్ స్కాం పై కేసీఆర్, కేటీఆర్‌ ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. సర్వేల ప్రకారం గెలుపు గుర్రాలకి‌ టికెట్లు ఇస్తామన్నారు. బీఆర్ఎస్‌ కి బీజేపీకి పార్టీనే ప్రత్యామ్నాయమన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ముందే ప్రకటించడం బీజేపీ సంస్కృతి‌ లేదని స్పష్టం చేశారు. బీజేపీని తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీ ని బీఆర్‌ఎస్‌ లేపుతుందని ఎద్దేవ చేశారు.
Harish rao: మూడోసారి కూడా తెలంగాణ సీఎం కేసీఆరే..

Show comments