NTV Telugu Site icon

Bandi Sanjay: కుట్రను కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బయట పెట్టారు

Bandi Sanjay Komatireddy Venkat Reddy

Bandi Sanjay Komatireddy Venkat Reddy

Bandisanjay satire on Komatireddy comments: కుట్రను కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బయట పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తరవాత అధికారం పంచుకోవాలని కాంగ్రెస్ , BRS డిసైడ్ అయ్యాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీ లు కలిసి పోటీ చేస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తు పై మాట్లాడిన కోమటి రెడ్డి పై ఆ పార్టీ ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. రెండు పార్టీ లు ఒక్కటే… డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. అధికారం పంచుకోవాలని అనుకుటుంటున్న కాంగ్రెస్ పార్టీ కి ఎందుకు ఓటు వేయాలి? అని మండిపడ్డారు. BRS తో పొత్తు అంటే సస్పెండ్ చేస్తా? అని రాహుల్ గతంలో అన్నాడు.. మరి కోమటి రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అని ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తే ఆ రెండు పార్టీ లు ఒకటే నని స్పష్టం అవుతుందని ఆరోపణలు గుప్పించారు. పక్కరాష్ట్రంలో ఏపీలో గిరిజన కార్పోరేషన్ ఏర్పాటు చేసిన గిరిజన గ్రామాలను అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.

Read also: Gutha Sukender Reddy: ఎప్పుడు ఏం మాట్లాడుతాడో తనకే తెలియదు.. కోమటిరెడ్డి పై గుత్తా ఫైర్

గిరిజన రిజర్వేషన్లు అమలు చెయ్.. రిజర్వేషన్లు కేంద్రం అడ్డుకుంటే నేను చూసుకుంటా! అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన బంధు ఏమైంది? అని ప్రశ్నించారు. లిపి లేని సమాజానికి దిశానిర్దేశం చేసిన వ్యక్తి సేవాలాల్ అని కొనియాడారు. ద్రౌపది ముర్ముని రాష్ట్రపతిగా చేసి గిరిజన జాతి గౌరవాన్ని ప్రధాని మోడీ నిలబెట్టారని గుర్తుచేశారు. గిరిజన ద్రోహి కేసీఆర్ అని.. సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం సేవాలాల్ జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నిర్వహించడం లేదని మండిపడ్డారు. బంజారాహిల్స్ లో సేవాలాల్ గుడిని అభివృద్ధి చేస్తామన్నారు. కొండగట్టు, వేములవాడకు ఇస్తానని చెప్పిన నిధులు ఎక్కడ? అని ప్రశ్నించారు. కొండగట్టు ప్రమాదంపై సీఎం కేసీఆర్ కనీసం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండగట్టు ప్రమాద బాధితులకు కనీస సహాయం చేయడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ రోజు సీఎం కేసీఆర్ కొండగట్టుకు వెళ్తున్న నేపథ్యంలో ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
CM KCR : కొండగట్టు అంజన్న సన్నిధిలో సీఎం కేసీఆర్‌.. పూర్ణకుంభంతో స్వాగతం