NTV Telugu Site icon

Bandi sanjay: నమ్మకం లేదన్నా నోటీసులు ఇచ్చారు.. నేడు సిట్ ముందుకు లీగల్ టీం

Bandi Sanjay

Bandi Sanjay

Bandi sanjay: Tspsc పేపర్ లిక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండిసంజయ్‌కు సిట్‌ రెండు సార్లు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి ఇచ్చిన సిట్‌ నోటీసులు తనకు రాలేదని, సిట్‌ నోటీసులు ఇచ్చిన సంగతి మీడియా కథనాల ద్వారా తెలిసిందని చెప్పడంతో..నిన్న సిట్‌ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు హాజరు కావాలని తెలిపారు. అయితే సిట్‌ నోటీసులకు బండిసంజయ్ స్పందించారు. ఉదయం 11 గంటలకు సిట్ ఆఫిస్ కు బండి సంజయ్ లీగల్ టీం వెల్లింది. దీంతో సంజయ్ లీగల్ టీం తో సిట్ విచారిస్తుంది. వారినుంచి ఎటువంటి ఆధారాలు బయటకు వస్తాయనే దానిపై సిట్ విచారణ కొనసాగుతుంది.

Read also: Prabhas Fans: మీ కష్టం ఎవరికీ రాకూడదు మావా… దర్శక నిర్మాతలు ఏమైపోయారో

సిట్ నోటీస్ లకు బండి సంజయ్ రిప్లై ఇచ్చారు. నాకు సిట్ మీద నమ్మకం లేదని చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాలు బిజీగా ఉన్నాను అని ఇప్పటికే తెలిపానని అన్నారు. అయినా కూడా మళ్ళీ నోటీస్ లు ఇచ్చారని మండిపడ్డారు. మీ పరిస్థితిని అర్థం చేసుకోగలనని అన్నారు. ఆ బాధ్యత గల మంత్రి ఇద్దరు మాత్రమే ఉన్నారు అని అన్నారు. లీక్ లో చాలా మంది ఉన్నారని సిట్ హెడ్ గా మీకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. స్కాం ను తక్కువ చేసి చూపెట్టే ప్రయత్నం మొదటి నుండి జరుగుతుందని ఆరోపించారు. రాజకీయాలను పక్కన పెట్టి మీ ఆత్మ సాక్షి తో ఆలోచించండని సంజయ్‌ పేర్కొన్నారు. ఈ స్కాం తో ఎన్నో లక్షల మంది మనో వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఒక గ్రామం నుండి ఎక్కువ మంది గ్రూప్ వన్ కి సెలెక్ట్ అయ్యారని సమాచారం నాకు వచ్చిందని, దాన్ని ప్రజల ముందు పెట్టానని అన్నారు. ప్రజా ప్రతినిధిగా వివిధ మార్గాల నుండి సమాచారం వస్తుందని తెలిపారు. ఈ సమయంలో పూర్తి వివరాలను బహిర్గతం చేయడం భావ్యం కాదని అనుకుంటున్నానని అన్నారు. అసలు విషయం పై విచారణ జరపకుండా సిట్‌ నాకు నోటీస్ లు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇచ్చారని ఎద్దేవ చేశారు. పార్లమెంట్ సమావేశాలు నేపథ్యంలో నేను హాజరు కావడం లేదని బండి సంజయ్‌ స్పష్టంచేశారు. ఈనేపథ్యంలో బండి సంజయ్‌ బదులు లీగల్ టీం హాజరవుతుందని వెల్లడించారు. అయితే బండి సంజయ్‌ లీగల్ టీం, సిట్‌ కు ఎలాంటి ఆధారాలు సమర్పించనుంది, ఏం చెప్పనుంది అనేదానిపై ఉత్కంఠత నెలకొంది.
Love Failure: లవ్ ఫెయిల్యూర్ ఎందుకు అంత బాధగా ఉంటుంది..? శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే..

Show comments