Site icon NTV Telugu

Bandi Sanjay: రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలా?

Bandi Sanjay

Bandi Sanjay

రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ రాజకీయ విమర్శలు చేస్తారా? అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని, సభలో చర్చ జరగాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొత్తగా నియమితులైన పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతోపాటు జిల్లా ఇంఛార్జ్ లతో బండి సంజయ్ సమావేశమయ్యారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాసం వెంకటేశ్వర్లు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ పార్లమెంట్ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లకు అప్పగించిన లోక్ సభ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు శాసనసభ స్పీకర్ తీరుపై నిప్పులు చెరిగారు. బీజేపీని చూస్తేనే కేసీఆర్ గజగజ వణికిపోతున్నారని ఎద్దేవ చేశారు. అసెంబ్లీ నిర్వహించాలంటే భయపడుతున్నాడని విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించకుండా కుట్ర చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు.
హిందూ పండుగలకు ప్రాధాన్యత లేకుండా కేసీఆర్ మహా కుట్ర చేస్తున్నాడని మండిపడ్డారు. షరతులు పేరుతో కన్ ఫ్యూజ్ చేయడం అందులో భాగమేనని బండి సంజయ్‌ అన్నారు. హిందూ సమాజమంతా సంఘటితం కావాల్సిందే అని పిలుపు నిచ్చారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉంటూ పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. స్పీకర్ పైనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభ్యులందరినీ సమన్వయం చేస్తూ సభ సజావుగా జరిగేలా పెద్దన్న పాత్ర పోషించాల్సిన స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున.. ఆయన తీరుపైనే శాసనసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
Wife Offers Supari To Kill Husband: సుపారి ఇచ్చి భర్త హత్య.. భార్యని పట్టించిన కాల్ డేటా

Exit mobile version