Bandisanjay challenges CM KCR: సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్ సవాల్ విసిరారు. యాద్రిద్రికి వస్తావా? రేపు ఉదయం యాదాద్రికి నేను బయలు దేరుతా ఉదయం 9 గంటలకు 10 గంటల వరకు అక్కడే వుంటా సీఎం కేసీఆర్ నువ్వురా.. నీకు సంబంధం లేదని, ఇది నిజంగా జరిగిందని ఓప్పుకోవాలని కోరారు. మొయినాబాద్ ఫాంహౌస్ వ్యహారంలో మునుగోడు ప్రచారంలో వున్న బీజేపీ రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. గతంలో ఒక ఎమ్మెల్యేను హత్యా ప్రయత్నం చేశామని ఢిల్లీ వెళ్లి డ్రామాలడారని, ఇదే కమీషన్ డ్రామా కంపెనీ అంటూ బండి సంజయ్ ఆరోపించారు. మునుగోడుకు టీఆర్‌ఎస్ పార్టీ ఒక లైన్ క్లియర్ చేసింది. మునుగోడు ప్రజలు టీఆర్‌ఎస్ డ్రామాలు చూసి నవ్వుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ కు ధన్యవాదాలు మాకు లైన్ క్లియర్ చేశారు. మీ డ్రామా, నటన, విధానం చూసి ఇంకా డ్రామాలు తెలంగాణ ముఖ్యముంత్రి ఖతమ్ చేయలేదని, గతంలో అలా చేసి మమ్మల్ని నిండా ముంచాడని, ఇప్పుడు మళ్లీ ఇలా చేశాడని నవ్వుకుంటున్నారని అన్నారు.
Read also:Chelluboina Venugopal : లోకేష్ కు రాజకీయ అవగాహన ఉందా
ఆ.. రెండు ఛానళ్లకు సంబంధించిన రిపోర్టర్లు 6గంటలకే వెళ్లి అక్కడ వున్నారు. పోలీస్ అధికారి ముందే వెళ్లి వచ్చారు. ముందే రికార్డు చేసి పెట్టుకున్నారు. స్వామిని కూడా వదిలిపెట్టరా? ఎందుకు ముఖ్యమంత్రికి హిందువులంటే అంత కోపం అంటూ ఆరోపించారు. స్వాములను పిలిపిచ్చి సీఎం కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లినప్పుడు సీఎం కేసీఆర్ అక్కడ ఈస్వామీలను కలిసారని నా డౌట్ అంటూ ఆరోపణలు గుప్పించారు. ఢిల్లీ వెళ్లిన సీఎం కుట్రచేసి స్వామీజీని కలిసి ఈ కుట్ర చేశారని ఆరోపించారు. ఆరోగ్యం బాగాలని, కళ్లు నొప్పులంటూ అంతా కేసీఆర్ డ్రామానే అక్కడి వెళ్లి స్వామీజీని పిలిపించుకుని ఈ డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు బండిసంజయ్.