NTV Telugu Site icon

వైట్‌ ఛాలెంజ్ స్వీకరించిన బండి సంజయ్‌..

తెలంగాణలో ఇప్పుడు వైట్‌ ఛాలెంట్‌ హాట్ టాపిక్‌గా మారిపోయింది.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సవాల్‌ విసిరితే.. ఆ సవాల్‌ను స్వీకరించిన మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి… బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, బీఎస్పీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లకు వైట్ ఛాలెంజ్ విసిరారు.. అయితే, మాజీ ఎంపీ కొండా ఛాలెంజ్‌ను స్వీకరిస్తూనే.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. బాగా బలిసినోడు, బలుపెక్కినోడే డ్రగ్స్ తీసుకుంటాడు… పేదోడికి అవసరం లేదన్న ఆయన.. కొండా విశ్వేశ్వరరెడ్డి చాలా మంచోడు.. కాంగ్రెస్‌ పార్టీలో కాంప్రమైజ్డ్ పాలిటిక్స్ నచ్చకే బయటకు వచ్చాడని వ్యాఖ్యానించారు. అయితే, కొండా విశ్వేశ్వర్ రెడ్డి నాకు వైట్ ఛాలెంజ్ చేశాడంట.. ఆ వైట్ ఛాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నానని ప్రకటించిన ఆయన.. నాకు ఎలాంటి అలవాట్లు లేవన్నారు.. అక్టోబర్ 2తో నా పాదయాత్ర పూర్తి అవుతుంది.. ఆ తర్వాత ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తానని వెల్లడించారు బండి సంజయ్‌.