NTV Telugu Site icon

Bandi Sanjay : గడీ నుండి బయటకు వచ్చి ఆ మహనీయుని స్మరించుకో

Bandi Sanjay

Bandi Sanjay

రెండవ దశ ప్రజా సంగ్రామ యాత్రను నేడు అలంపూర్‌ జోగులంబ నుంచి తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రారంభించనున్నారు. అయితే నేడు డా.బీఆర్‌ అంబేద్కర్‌ 131 జయంతి సందర్భంగా జోగులాంబ జిల్లాలోని అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. అంబేద్కర్‌ పెట్టిన భిక్ష వల్లే తాను ప్రధాని అయ్యానని మోడీ చెప్పారన్నారు. అంబేద్కర్‌కి భారత రత్న ఇచ్చి గౌరవించిన పార్టీ బీజేపీ అని ఆయన కొనియాడారు.

అంబేద్కర్‌కి మంత్రి పదవి ఇవ్వని, అంబేద్కర్ ని ఓడించిన పార్టీ కాంగ్రెస్ అని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అంబేద్కర్ జయంతికి ఈ రోజైన వెళ్ళాలని.. సీఎం గడీ నుండి బయటకు వచ్చి ఆ మహనీయుని స్మరించుకో అని ఆయన వ్యాఖ్యానించారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తానని ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని, అంబేద్కర్ స్ఫూర్తిగా ఈ రోజు నుండి ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తున్నానన్నారు. మహనీయుని ఆశయాలు సాధించేందుకు ముందుకు వెళ్తామని ఆయన అన్నారు.

BJP Laxman : భారత ప్రజలను, అంబేద్కర్‌ను కేసీఆర్‌ అవమానించారు