సంఘ విద్రోహ శక్తులకు, రౌడీషీటర్లకు మద్దతిచ్చే వాళ్లు కూడా సంఘ విద్రోహశక్తులుగానే పరిగణించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శాంతిభద్రతల విషయంలో పోలీసులు రాజీ పడొద్దని, ముఖ్యంగా సంఘ విద్రోహ శక్తులను కఠినంగా అణిచి వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో పోలీసులకు కేంద్రం పూర్తిగా అండగా ఉంటుందన్నారు.
Sree Leela : అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. శ్రీలీల కోరికలు విన్నారా
రౌడీషీటర్ అన్సారీ దాడిలో గాయపడి సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ చైతన్య కుమార్, కానిస్టేబుల్ వీఎస్ఎన్.మూర్తి లను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం పరామర్శించారు. డీసీపీ, కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రౌడీషీటర్ అన్సారీ దాడితో డీసీపీ, కానిస్టేబుల్ తీవ్ర గాయాలు అయ్యాయని ఈ సందర్భంగా వైద్యులు కేంద్ర మంత్రికి వివరించారు. ప్రస్తుతం మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా డీసీపీ చైతన్య, కానిస్టేబుల్ ను పరామర్శించిన బండి సంజయ్ వారు చూపిన తెగువను కొనియాడారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని, సంఘ విద్రోహ శక్తులను అణిచి వేయాల్సిందేనని చెప్పారు. ఈ విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు.
Vitamin D Tablets: విటమిన్ డి ట్యాబ్లెట్స్‌తో మూత్రపిండాలకు ఎఫెక్ట్!
