మా పాదయాత్రతో సీఎం కేసీఆర్ వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని వ్యాఖ్యానించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నిర్మల్ జిల్లా అడెల్లి పోచమ్మను దర్శించుకున్న ఆయన.. 5వ విడత పాదయాత్రను ప్రారంభించారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో అనేక సమస్యలు ఉన్నాయి.. కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు, ప్రజల కష్టాలను గాలికి వదిలేసి, ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారని ఆరోపించారు.. ప్రజల కష్టాలను తెలుసుకునేందుకు, ప్రజలకు భరోసా కల్పించేందుకే పాదయాత్ర చేస్తున్నానని.. ఇప్పటివరకు నాలుగు విడతలుగా పాదయాత్ర చేసి, ఈరోజు అడెల్లి పోచమ్మ అమ్మవారిని దర్శించుకుని, 5వ విడత పాదయాత్రను ప్రారంభించినట్టు వెల్లడించారు..
Read Also: CST Tax Cancelled on Rice Export: రైతులకు, మిల్లర్లకు సీఎం గుడ్‌న్యూస్.. ఆ పన్ను రద్దు
ఇక, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉచిత విద్య, వైద్యం హామీని నెరవేరుస్తాం అని ప్రకటించారు బండి సంజయ్.. ఇల్లు లేని నిరుపేదలకు ఇంటిని నిర్మించి ఇస్తాం, తెలంగాణలో ఫసల్ బీమా యోజన పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి తీరుతామన్న ఆయన.. పేదల కోసమే మా ఈ ప్రజా సంగ్రామ యాత్ర అన్నారు..
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారిపోతాయి.. మా పాదయాత్రతో కేసీఆర్‌కు వెన్నులో వణుకు స్టార్ట్ అయ్యిందని ఎద్దేవా చేశారు.. కుట్రలో భాగంగానే ఇవాళ మా పాదయాత్రను కేసీఆర్ డైరెక్షన్ లో పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించిన ఆయన.. సీఎంవో నుంచి వచ్చిన ఆదేశాలతోనే నన్ను అడ్డుకుంటున్నట్టు పోలీసులు చెప్తున్నారని.. అసలు భైంసాను సెన్సిటివ్ ప్లేస్ గా మార్చింది ఎవరో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కుంటి సాకులు చెప్పి, పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తే… గౌరవ హైకోర్టులో పిటిషన్ వేసి, అనుమతి పొందామన్నారు బండి సంజయ్.. కోర్టు ఉత్తర్వులకు లోబడి మా పాదయాత్ర, బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు.. ఇవాళ మా పాదయాత్రను చెప్పిన టైమ్ ప్రకారం స్టార్ట్ చేశాను.. అడెల్లి పోచమ్మ అమ్మవారి పాదాల చెంత 5వ విడత పాదయాత్ర ప్రారంభించాం.. గౌరవ హైకోర్టు నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు. మరోవైపు, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల కార్వాన్ ను టీఆర్ఎస్ కార్యకర్తలు తగలబెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు బండి సంజయ్.. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నదే కేసీఆర్ అండ్ బ్యాచ్ అని ఆరోపించారు.. ఒక మహిళ అని కూడా చూడకుండా.. షర్మిలను అరెస్టు చేయడం, ఆమె వాహనాన్ని తగలబెట్టడం దేనికి సంకేతం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు బండి సంజయ్.