NTV Telugu Site icon

Bandi Sanjay: అగ్నిప‌థ్‌ మంచి స్కీమ్.. నిరసన చెప్పే పద్ధతి ఇది కాదు..

Bb

Bb

నిరసన చెప్పే పద్ధతి ఇది కాదని, అగ్నిఫ‌థ్‌ మంచి స్కీమ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయ‌న ఆర్మీలో సేవ చేయలనుకునే యువకులను 40 వేల మంది రిక్రూట్ మెంట్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. రిక్రూట్ మెంట్ లో పది శాతం రిజర్వేషన్ ఉంటుందని చెప్పారు బండి సంజ‌య్‌. ఆర్మీలో పనిచేయాలని సేవ చేయాలని అనుకున్న వాళ్లకు మంచి అవకాశం మ‌ని అన్నారు.

Read Also: Harish Rao: అగ్నిపథ్‌తో ఆర్మీ ఉద్యోగాలకు కేంద్రం మంగళం పాడుతోంది

దేశ భద్రత విషయంలో మంచి పథకం వస్తే స్వాగతించాలని బండి సంజ‌య్ అన్నారు. ఆర్మీ రిక్రూట్ మెంట్ జరుగుతుందని పేర్కొన్నారు. సికింద్రాబాద్ లో విధ్వంసం చేసింది ఎవరు? చేసిందో క‌నుక్కోవాల‌ని అన్నారు. రాళ్లు ఎవరు వేసారో తెలియలేదని యువకులు చెప్తున్నారు, ఆర్మీలో పనిచేయాలనుకునే వాళ్ళు ఇలాంటివి చేయలేదని బండి సంజ‌య్ అన్నారు. విధ్యంసం చేసింది ఎవరో గుర్తించాలని డిమాండ్ చేశారు. రైల్వే గోడలు కూల్చారు అంటే ఇది అనుకోకుండా జరిగిన సంఘటనా అంటూ బండి సంజ‌య్ అన్నారు.

పేట్రోల్ లో కాల బెట్టడం, గ్రానైట్ పగల గొట్టడం ఎలా జరుగుతుందని ప్ర‌శ్నించారు. ఇంటిలిజెన్స్ అధికారులకు సమాచారం వచ్చినా పట్టించుకోలేదని మండి ప‌డ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతోనే సంఘ విద్రోహ శక్తులు కుట్ర జరిగిందని ఆరోపించారు. రాష్ట్ర పోలీసులు కాల్పులు జరపడం వల్లనే యువకుడు చనిపోయాడా? మధ్యాన్నం నుండి సాయంత్రం వరకూ యువకులతో మాట్లాడే ప్రయత్నం చేయలేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముప్పైకోట్ల ఆస్తుల నష్టం చేసేలా దాడి చేసిన వాళ్ళు పారిపోయారు.. అమాయకులు అక్కడే ఉన్నారని మండి ప‌డ్డారు. సాయంత్రం 6 గంటలకు పది నిమిషాల్లో క్లియర్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని బ‌ద‌నాం చేసిన తరువాతనే క్లియర్ చేశారని బండి సంజ‌య్ ఆరోపించారు.