ప్రధానికి కృతజ్ఞతలు చెప్పడం లేదు… కెసిఆర్ సంస్కార హీనుడు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిఎం కెసిఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారి నుండి కాపాడేందుకు వాక్సిన్ తయారీలో మోడీ చూపించిన చొరవ అభినందనీయమన్నారు. స్వదేశీ కంపెనీలు వ్యాక్సిన్ తయారు చేయకుండా ఉంటే లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేదని…రాబోయే రోజుల్లో వాక్సినేషన్ లో అగ్రస్థానంలోకి మన దేశం రానుందని పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల సీఎంలు మోడీకి కృతజ్ఞతలు తెలిపారని..తెలంగాణ సీఎం కెసిఆర్ మాత్రం స్పందించలేదని…ఆయనొక సంస్కార హీనుడని మండిపడ్డారు. రూ. 2,500 కోట్లు ఎక్కడ ఖర్చు చేసావు… కమిషన్లు పోయాయనే పీఎంకి కృతజ్ఞతలు చెప్పలేదన్నారు. వ్యాక్సిన్ వృధాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని పేర్కొన్నారు. పార సీటమాల్ తో కరోనా పోతుందన్న సీఎం ఇప్పుడు వైద్య మంత్రి అయ్యారని ఎద్దేవా చేశారు. కేంద్రాన్ని విమర్శించడం తప్ప.. కెసిఆర్ ఏమీ చేయడం లేదని.. ఆరోగ్య శ్రీ లో కరోనాను చేర్చాలని డిమాండ్ చేశారు. ఒకాయన సిద్దిపేటలో.. ఇంకోకాయన ట్విట్టర్ లో మాట్లాడుతారని చురకలు అంటించారు.
Also Read
- OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
- Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
- Astro Scam : జ్యోతిష్యం పేరుతో జేబుకు జలక్.. కొత్త సైబర్ స్కామ్ అలర్ట్.!
- OTR : సడన్ గా ఆగిపోయిన గాంధీభవన్ ముఖాముఖి.. కాంగ్రెస్‌లో మంత్రులపై అధిష్టానం సీరియస్?
తాజావార్తలు
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!