NTV Telugu Site icon

Bandi Sanjay: ప్రజా పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు..!

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: ప్రజా పాలనాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని వెంకటంపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న ‘‘వికసిత్ భారత్ సంకల్ప యాత్ర’’లో బండి సంజయ్ పాల్గొన్నారు. వికసిత్ సంకల్ప యాత్ర ఉద్దేశాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై వెంకటంపల్లి గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు గత ప్రభుత్వ పాలనా నచ్చక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చారని అన్నారు. ప్రజలను అప్పటి ప్రభుత్వం, లాగే ఇప్పటి ప్రభుత్వం మోసం చేసి, పాలిస్తాం అంటే, మళ్లీ బీజేపీ ఉద్యమం చేయాల్సి ఉంటుందన్నారు.

Read also: Raghunandan Rao: బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఎప్పుడు ఒకటి కాదు.. దయచేసి నమ్మకండి..!

ప్రజా పాలనాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చిలో మళ్లీ ఎన్నికలు వచ్చి ఎలక్షన్ కోడ్ వస్తే, లబ్ధిదారుల ఎంపిక, ఆపేస్తారా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను, వడ్డీలను చెల్లించని స్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉందని అన్నారు. అవి చాలావని ఇప్పుడు ఈ ప్రభుత్వం, అవన్నీ ఎలా తీరుస్తాయన్నారు. ఉద్యోగుల బాధలు గుర్తున్నాయా? జీతాలు ఎలా ఇస్తారు? అని ప్రశ్నించారు. మల్దీవ్ కి, భారతదేశం ప్రజలు బుద్ది చెప్పారని అన్నారు. భారతీయులు అందరూ తలుచుకుంటే, ఎవరైనా తలదించాల్సిందే అని అన్నారు.
Realme 12 Series Launch: లేటెస్ట్ కెమెరాతో భార‌త మార్కెట్‌లోకి రియల్‌మీ 12 సిరీస్!