NTV Telugu Site icon

Bandi Sanjay: రెండు రోజులు కనపడకుంటే ఇంత రాద్ధాంతం చేయాలా..

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కాళ్ళ నొప్పితో రెండు రోజులు కనపడలేదు దానికి ఇంత రాద్ధాంతం చేయాలా అని బీఆర్ఎస్ శ్రేణులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
లేచినా, పడుకున్నా.. బీఆర్‌ఎస్‌ నేతలకు నేనే గుర్తుకువస్తున్నా.. అందుకే బీఆర్ఎస్ సంగతి చెబుతామని వచ్చానని తెలిపారు. కలెక్టర్ పై దాడి అనేది దారుణం అన్నారు. రైతులు కలెక్టర్ పై దాడి చేయలేదని స్పష్టం చేశారు. ఈ దాడి వెనుక కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది.. అయిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? అని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శం అన్నారు. కేటీఆర్ నక్క వినయం ప్రదర్శించి అన్ని ఛానెళ్లను కేటీఆర్ ఇంటర్వ్యూ ఇచ్చారన్నారు. కేసీఆర్ కొడుకు నటసార్వభౌముడన్నారు. ఢిల్లీకి పోయి ఇద్దరు ఒక్కటయ్యారని మండిపడ్డారు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ ని కలిశారని కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసుని ఇలానే నీరు గార్చారని గుర్తుచేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగిందని తెలిపారు. కేటీఆర్ కి తెలియకుండా ఇది జరుగుతుందా? అని ప్రశ్నించారు. అప్పుడు, ఇప్పుడు సీఎం కేటీఆరే అన్నారు. దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయి అని ప్రశ్నించారు.

Read also: Fahadh Faasil : మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న మాలీవుడ్ హీరో

ఈ ఫార్ములా కేసు, ధరణి కేసు, జన్వాడ ఫామ్ హౌస్ కేసు, డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయన్నారు. జనాలని, మీడియాని కాంగ్రెస్, బీఆర్ఎస్ వాళ్ళు పిచోళ్ళు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకి ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకటి రేవంత్ రెడ్డి, రెండు కేటీఆర్ అన్నారు. కేటీఆర్ కి బండి సంజయ్ సవాల్ చేశారు. రేవంత్ కుటుంబానికి, కేసీఆర్ కుటుంబానికి సంబంధం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నారు. నేను నిరూపిస్తా…మీరు రేడినా అన్నారు. తెలంగాణలో ఆర్కే పాలన నడుస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీని అడ్డుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి నాటకాలు ఆడుతున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బ్యాన్ చేయాలన్నారు. విధ్వంసాలు చేసి ఎదో రకంగా తెలంగాణలో అధికారంలో రావాలని బీజేపీ చూస్తోందన్నారు. లగచర్ల విషయంలోనూ బీఆర్ఎస్ ఇదే చేసిందన్నారు. చేతగాని ముఖ్యమంత్రి ఉన్నందుకు ఇలా జరుగుతుందన్నారు. మూసీ ప్రక్షాలనకు మేం వ్యతిరేకం కాదన్నారు.

Read also: Amyra Dastur : సాగరతీరంలో సొగసరి.. అందాలు చూస్తే ఔరా అనాల్సిందే

కానీ మూసీ పేరుతో లక్షల కోట్లు దోచుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు..దీనికి మేం వ్యతిరేకం అన్నాఉ. పేదల ఇండ్లు కూల్చవద్దు అని మేం డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై బండి మాట్లాడుతూ.. నేను కేంద్ర మంత్రిని నాకు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం లేదన్నారు. బీజేపీ సభ్యత్వం గతంలో కంటే ఎక్కువగా అయ్యిందన్నారు. ధాన్యం కొనుగోలు చేయట్లేదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు టార్గెట్ పెట్టుకుందని తెలిపారు. ప్రభుత్వం ధాన్యం కొనకపోవడంతో దళారులకు తక్కువ ధరకు రైతులు అమ్ముకున్నారన్నారు. ఎన్నికల సమయంలో ధాన్యానికి 500 బోనస్ అని చెప్పి ఇప్పుడు సన్న వడ్లకే అని అంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ప్లాన్ ప్రకారం కొనుగోళ్లు ఆలస్యం చేస్తుందన్నారు. ఒక 50 శాతం మందికే బోనస్ ఇవ్వాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని తెలిపారు.

Read also: Health Benefits: ఉదయమే కాదు రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే ఎన్నో బెనిఫిట్స్‌..

రైతులు ఇబ్బందులు పడుతుంటే ధాన్యం సజావుగా కొనసాగుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు సజావుగా సాగితే ముక్కు నేలకు రాస్తా మీరు రేడినా అని ప్రభుత్వానికి బండి సంజయ్ సవాల్ విసిరారు. తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తారా? అని ప్రశ్నించారు. రైతు భరోసా లేదు..కౌలు రైతులకు సహాయం లేదన్నారు. రైతులకు బోనస్ లేదన్నారు. దళారి వ్యవస్థను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుందన్నారు. దళారుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ తీసుకుంటుందని తెలిపారు. రైతు సమస్యను పట్టించుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. లగచర్ల ఫార్మసిటికి మేం వ్యతిరేకం కాదన్నారు. కానీ రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. రైతుల గురించి ఆలోచించకుండా దౌర్జన్యం చేస్తే ఇది రాచరిక పాలనా..? అని మండిపడ్డారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలానే చేసిందన్నారు. ఇది కూడా టాపిక్ డైవర్షన్ కోసమే కాంగ్రెస్, బీఆర్ఎస్ చేస్తున్నాయన్నారు.
AP News: పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్!