NTV Telugu Site icon

Bandi Sanjay: రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానం

Bandi Sanjay Formers

Bandi Sanjay Formers

Bandi Sanjay: రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. సంక్రాంతి పర్వదినం సందర్భంగా.. తెలుగు ప్రజలకు భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి విశ్వమంగళ దినమని అన్నారు. దురద్రష్టకమేమిటంటే ప్రత్యేక రాష్ట్రం వచ్చి 8 ఏళ్లయినా ధనిక రాష్ట్రం అప్పుల తెలంగాణగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ రైతులు నిండా కష్టాల్లో, నష్టాల్లో కూరుకుపోయారన్నారు. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉందని ఆరోపించారు. అయినప్పటికీ తన విద్యుక్త ధర్మాన్ని వీడకుండా నీళ్లున్నా లేకున్నా, కరెంట్ వచ్చినా రాకున్నా, పంటకు ధర వచ్చినా రాకున్నా ఆరుగాలం కష్టపడి కలో, గంజో తాగి పంట పండించి దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని అన్నారు.

Read also: Master Plan: భోగి రోజు భగ్గుమన్న కామారెడ్డి.. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ముగ్గులతో నిరసన

వచ్చే ఏడాది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, రాష్ట్రానికి పట్టిన చీడ, పీడలు విరగడై సరికొత్త కాంతులతో రైతన్నలు సుఖసంతోషాల మధ్య సంక్రాంతి జరుపుకుంటారని ఆశిస్తున్నానని బండి సంజయ్‌ తెలిపారు. అప్పుల తిప్పలు లేని, ఆత్మహత్యల్లేని, కల్లాల దగ్గర కన్నీళ్లులేని సుభిక్ష పాలన రావాలని కోరుకుంటున్నానని తెలిపారు. అప్పటిదాకా కష్టనష్టాలను ఎదుర్కొనే మనోధైర్యం ప్రజలకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. పండుగ రోజు సైతం అబద్దాలు చెప్పకుండా ప్రజలకు వాస్తవాలు చెప్పేలా బుద్ధిని రాష్ట్ర పాలకులకు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నాని బీజేపీ నేత బండి సంజయ్‌ అన్నారు.
Gopichand 30: భోగి రోజున బాలయ్య వదిలిన ‘రామబాణం’

Show comments