Bandi Sanjay released from jail: కరీంనగర్ జైల్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విడుదల అయ్యారు. సంజయ్ విడుదల నేపథ్యంలో జైల్ వద్ద ప్రదర్శనలు, ర్యాలీ లేకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు. కరీంనగర్ జిల్లా జైల్లో ఉన్న బండి సంజయ్ కి నిన్న రాత్రి బెయిల్ మంజూరైంది. సుదీర్ఘ వాదోపవాదాల తరువాత షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇద్దరు జామీనుతో పాటు రూ.20వేల పూచీకత్తుతో నిన్న రాత్రి 10 గంటలకు రిలీజ్ ఆర్డర్ కోర్టు ఇచ్చింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని సాక్ష్యాలను చేరిపివేయవద్దని, దేశం విడిచి వెళ్లొద్దని న్యాయస్థానం షరతులు విధించింది. దీంతో కరీంనగర్ జైలుకు సంజయ్ బెయిల్ పత్రాలు చేరాయి. టెన్త్ పేపర్ లీకేజీ లో మంగళవారం సంజయ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన తెలిసిందే. ప్రశ్నా ప్రతాల లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి సంజయ్ కి నిన్న హనుమకొండ కోర్టు 14 రోజుల రిమాండ్‌ను విధించింది.
Read also: Pakistan Economic Crisis: ప్రజలకు 24 గంటలు గ్యాస్ అందించలేము.. పాక్ మంత్రి
ఈ నేపథ్యంలో బండి సంజయ్ తరుఫున లాయర్లు బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేయగా కోర్టు విచారణ చేపట్టింది. ఇదే సమయంలో బండి సంజయ్‌కు బెయిల్ ఇవ్వద్దని.. కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. దీంతో.. రెండు పిటిషన్లపై హనుమకొండ ఫస్ట్ క్లాస్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనిత రాపోలు విచారణ చేపట్టారు. బండి సంజయ్‌కు పేపర్ లీకేజీతో సంబంధం లేదని ఆయన తరుఫు లాయర్లు వాదనలు ఒకవైపు ఉండగా.. బండి సంజయ్‌కు బెయిల్ ఇస్తే.. ఆధారాలు తారుమారు చేస్తారని, ఇంకా ఆయనను విచారించాల్సింది ఉందంటూ.. పోలీసులు మరోవైపు వాదనలు వినిపించారు. దీంతో బండి సంజయ్ బెయిల్‌పై నిర్ణయాన్ని మూడుసార్లు వాయిదా వేసిన మెజిస్ట్రేట్ చివరకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
Pakistan Economic Crisis: ప్రజలకు 24 గంటలు గ్యాస్ అందించలేము.. పాక్ మంత్రి
