NTV Telugu Site icon

Bandi Sanjay: సబ్సిడీపై ఎరువులు ఇస్తున్న ఘనత మోదీదే

Sanjay

Sanjay

దేశవ్యాప్తంగా రైతుల ప్రయోజనాలు, శ్రేయస్సు కోసం కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తుందని.. రైతులకు భారం పడకుండా భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తున్న ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం ద్వారా అర్హులైన రైతులకు కేంద్రం ఏటా 3 విడతల్లో రూ. 2000 చొప్పున 6000 అందిస్తుందని చెప్పారు.

రైతును రాజు చేయాలనే కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం అహర్నిశలు పని చేస్తుందన్నారు. ముఖ్యంగా రైతులపై ఎరువుల భారం పడకుండా తక్కువ ధరకు అందించడానికి వీలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని వివరించారు. డీఏపీ, నైట్రోజన్, పొటాషియం, పాస్పరస్, ఎరువులకు సబ్సిడీ అందించడానికి కేంద్రం 1 లక్షా 60 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని తెలిపారు. ఒక బస్తా డీఏపీ ధర రూ.3,851 ఉందని, రైతులకు రూ.1,350 లకే సబ్సిడీ కింద ఎరువులను అందిస్తున్నామని బండి సంజయ్ అన్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఫెర్టిలైజర్ల ధరలు పెరిగినా దేశంలో రైతులపై కేంద్రం భారం మోపలేదన్నారు. రైతులపై కేంద్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని అన్నారు. దేశం యొక్క స్థితిని, గతిని మార్చడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో మెరుగైన పాలనను అందిస్తుందన్నారు.