NTV Telugu Site icon

Bandi Sanjay: కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుంది

Bandi Sanjay Tweet

Bandi Sanjay Tweet

Bandi Sanjay Posted Long Tweet After Resigning as Telangana BJP State President: తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం బండి సంజయ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ సుదీర్ఘమైన ట్వీట్ పోస్ట్ చేశారు. తనలాంటి సాధారణ కార్యకర్తకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు గాను పార్టీ జాతీయ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తాను బీజేపీ హైకమాండ్ అంచనాలకు అనుగుణంగానే పని చేశానని భావిస్తున్నానని చెప్పారు. తాను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో.. తనకు అందించిన మద్దతు, ప్రేమ, ప్రోత్సాహానికి గాను సెంట్రల్ పార్టీకి, రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే.. అన్ని మోర్చాల నాయకులు, సభ్యులకు, సంగ్రామ సేన, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఉద్యోగులు, సోషల్ మీడియా యోధులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకొచ్చారు.

Daggubati Purandeswari: షాక్‌లో ఏపీ బీజేపీ నేతలు.. పురంధేశ్వరికి బాధ్యతల వెనుక అసలు కారణం ఇదేనా..?

ఇదే సమయంలో.. ప్రజా సంగ్రామ యాత్రలో అడుగడుగునా తనని ముక్తకంఠంతో స్వాగతించిన తెలంగాణ ప్రజలకు కూడా బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు తనని తీర్చిదిద్దిన కరీంనగర్ ఓటర్లకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. మన జీవితంలోని కొన్ని అధ్యాయాలు మూతపడకుండానే మూసుకుపోవాల్సి వస్తుందని.. తన పదవీకాలంలో తాను అనుకోకుండా ఎవరినైనా బాధపెట్టినట్లయితే, తనని మీ ఆశీర్వాదాల్లో ఉంచాలని కోరారు. తాను విచారకరమైన కథను కానందుకు సంతోషిస్తున్నానన్నారు. అరెస్టుల సమయంలో తనతో ఉండటం, దాడి జరిగినప్పుడు పక్కన నిలబడటం, సంతోషకరమైన క్షణాల్లో నవ్వుతూ.. అందరూ తనకు మరపురాని క్షణాలను అందించారన్నారు. కేసీఆర్ పాలనపై తాను చేసిన పోరాటంలో అరెస్టులు, దాడులు ఎదుర్కొన్నప్పటికీ అండగా నిలిచిన బీజేపీ కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు. తాను మీలో ఒకడినని, ఎల్లప్పుడూ అలాగే ఉంటానని అన్నారు. కిషన్ రెడ్డి సమర్ధవంతమైన నాయకత్వంలో తాను నూతనోత్సాహంతో పార్టీ కోసం పని చేసేందుకు ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చారు.

Bandi Sanjay: బండి సంజయ్ రాజీనామా.. కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి

Show comments