Site icon NTV Telugu

Bandi Sanjay: రైతుల జీవితాలతో ఆడుకుంటే ఖబడ్దార్

ముఖ్యమంత్రి కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈమేరకు ఆయన బహిరంగ లేఖ రాశారు. ప్రధాని నరేంద్రమోదీ గారికి కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలు వున్నాయన్నారు. కేసీఆర్ వి అబద్ధాలేనని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు ఆధారాలతో సహా తేల్చారు. వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి.. లేనిపక్షంలో కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయాలి. పంజాబ్ సహా అన్ని రాష్ట్రాల్లోనూ కేంద్రం బియ్యం సేకరిస్తుందే తప్ప ధాన్యం సేకరించడం లేదు.

కేంద్రం యాసంగిలో వరి ధాన్యం కొనబోమన్నది అబద్ధం. వానాకాలం మాదిరిగానే యాసంగిలోనూ సేకరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందన్నారు బండి సంజయ్. మిల్లర్లతో కుమ్మక్కై రేషన్ బియ్యం రీ సైక్లింగ్, లేని పంటను లెక్కల్లో చూపడం, పక్క రాష్ట్రాల్లోని బియ్యాన్ని తెచ్చి అమ్మినట్లు సమాచారముంది.

టీఆర్ఎస్ సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే రైతులు పండించిన ధాన్యాన్ని, ప్రతీ గింజను కొనుగోలు చేయాలి. రైతుల జీవితాలతో రాజకీయం చేస్తే బిజెపి చూస్తూ ఉరుకోదు.రైతులకు అండగా ఉద్యమిస్తుందన్నారు.

https://ntvtelugu.com/piyush-goyal-fires-on-telangana-govt/
Exit mobile version