Bandi Sanjay : రండి కదలండి అంటూ.. రైతులకు బహిరంగ లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీఆర్ఎస్ వడ్ల రాజకీయం వెనుక మహా కుట్ర జరుగుతోందని, బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కయ్యారని, భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు గులాబీ దండు స్కెచ్ అని, రైతులు అనివార్యంగా తక్కువ ధరకే వడ్లు విక్రయించేలా ప్లాన్, అన్నదాతాలారా…. కేసీఆర్ కుట్రలను చేదిధ్దాం రండి. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేలా కేసీఆర్ మెడలు వంచుదాం రండి.. అంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ రైతులకు బహిరంగ లేఖ రాశారు. యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలు మూసివేయడం వెనుక మహా కుట్ర దాగి ఉందని, పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో పనిలేకుండా తక్కువ ధరకే బ్రోకర్లకు (దళారులకు) అమ్ముకునేలా రైతులకు అనివార్య పరిస్థితులు సృష్టించి పెద్ద ఎత్తున లబ్ది పొందాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పథకం రచించారని ఆయన ఆరోపించారు.
బ్రోకర్ల మాఫియాతో కలిసి పెద్ద స్కెచ్ వేశారని, దీనివెనుక వందల కోట్ల రూపాయలు కమీషన్ల పేరిట ప్రభుత్వ పెద్దలకు ముట్టబోతున్నాయని, యాసంగిలో వడ్ల కొనుగోలు కేంద్రాలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం అందులో భాగమేనని, అయితే రైతులు పంట ఎందుకు కొనడం లేదని నిలదీసే అవకాశం ఉన్నందున… ఆ నెపాన్ని కేంద్రంపై రుద్ది బద్నాం చేయడమే లక్ష్యంగా వడ్ల కొనుగోలు పేరిట డ్రామాలాడుతున్నారని ఆయన మండిపడ్డారు. వడ్ల పేరుతో మరోసారి ‘తెలంగాణ సెంటిమెంట్’ ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని కేసీఆర్ ఆధ్వర్యంలోని టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డ్రామాలను తెలంగాణ రైతాంగం గమనించాలన్నారు.
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
మంచి చేస్తాడని ఓట్లేస్తే… లేని సమస్యను సృష్టించి రాజకీయాలు చేస్తున్న సీఎం కేసీఆర్ కు, టీఆర్ఎస్ పార్టీ నేతలకు తగిన బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ రైతు సోదరులారా…. న్యాయ నిర్ణేతలు మీరే….ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ మెడలు వంచేందుకు బీజేపీ చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ముగిస్తున్నానని ఆయన లేఖను విడుదల చేశారు.
https://ntvtelugu.com/etela-rajender-about-paddy-procurement/
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!