NTV Telugu Site icon

Bandi Sanjay: ఆరు గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ చేతులెత్తేసింది..! బండి కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay Karimnagar

Bandi Sanjay Karimnagar

Bandi Sanjay: కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలుపై చేతు లెత్తేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ రైతు దీక్షలో వున్న ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నమ్మి ఓటేసిన రైతులు మోసపోయారన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చేతులెత్తేసిందన్నారు. కోట్లాది రూపాయల ప్రకటనలతో 6 గ్యారంటీలను అమలు చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.

Read also: RCB vs LSG Dream 11 Prediction: బెంగళూరు, లక్నో డ్రీమ్ 11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్!

రైతు భరోసా కింద ఎకరాకు రూ.15 వేలు ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. రూ.2 లక్షల రుణమాఫీ ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామన్న హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైనయ్.. వెంటనే బోనస్ ప్రకటించండి అని డిమాండ్ చేశారు. తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేయాలన్నారు. సమగ్ర పంటల బీమా పథకాన్ని ఎందుకు తీసుకురాలేదు? అని తెలిపారు. అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. చేతికందిన పంట నీళ్లపాలైందని అన్నారు. అకాల వర్షాలకు రాలిపోయిన మామిడి పిందెలను, రాలిన వడ్ల కంకులను మీడియాకు చూపించారు.

Read also: Madhya Pradesh : రూ.29లక్షల రివార్డ్.. భయంకరమైన నక్సలైట్ క్రాంతి హతం

సాగునీరు లేక పంట ఎండిపోయి రైతులు నష్టపోతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు? అని అన్నారు. ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం చెల్లించాల్సిందే అని డిమాండ్ చేశారు. రైతు భరోసా పేరుతో రైతులకు, కౌలు రైతులకు రూ.15 వేలు చెల్లించాల్సిందే అన్నారు. రైతు కూలీలకు సైతం ఏటా రూ.12 వేల ఇవ్వాల్సిందే అన్నారు. కేంద్రం ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయరు…. పంటల బీమాను అమలు చేయరు.. రైతులెలా బతకాలి? అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా తక్షణమే వడ్ల కొనుగోలు చేయాల్సిందే అన్నారు. కాంగ్రెస్ మోసాలను ఎండగట్టి రైతులకు భరోసా కల్పించేందుకే రైతు దీక్ష చేస్తున్నా అని తెలిపారు.
Fake Doctors: నకిలీ వైద్యులు, ఆర్ఎంపీ, పీఎంపీ వ్యవస్థలపై టీఎస్‌ఎంసీ ఉక్కుపాదం..