Bandi Sanjay: ఈడీ వస్తుందంటే కాలు విరుగుతుంది, సీబీఐ వస్తుందంటే దుబాయి వెళ్తారు, ఇలాంటి నాయకులు బీఆర్ఎస్ లో ఉన్నారంటూ ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. వరంగల్ లో జరిగిన నిరుద్యోగ మార్చ్ లో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ పై పలు విమర్శలు గుప్పించారు. ఇదే వరంగల్ గడ్డపై తనను అరెస్ట్ చేశారని, కేసీఆర్ కి బలగం కేవలం కొడుకు, కూతురు, అల్లుడే అని, బీజేపీకి బలగం తెలంగాణ ప్రజలని ఆయన అన్నారు.
Read Also: YSRCP Campaign Heat: 7రోజుల్లో 63 లక్షల కుటుంబాలకు…జగనన్నే మా భవిష్యత్తు క్యాంపైన్
విద్యార్థుల ఉద్యమ గడ్డ, ప్రోఫెసర్ జయశకంర్ పుట్టిన గడ్డ వరంగల్ అని, మమ్మల్ని అరెస్ట్ చేస్తే భయపడే కార్యకర్తలం కాదని ఆయన అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు అన్న తెలంగాణాలో నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు. ఇంటికి ఓ ఉద్యోగం ఇస్తానని తెలంగాణ ప్రజలు కేసీఆర్ మోసం చేశారని దుయ్యబట్టారు. టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిని వారి భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ అని, రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయితే బండి సంజయే, టెన్త్ పేపర్ లీక్ అయితే బండి సంజయే కారణమా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మా అత్త దశదిన కర్మకి వెళ్తే అరెస్ట్ చేశారు. గతంలో రేవంత్ బిడ్డ పెళ్లి జరుగుతుంటే ఆయనను అరెస్ట్ చేశారు, సెంటిమెంట్ లేని వ్యక్తి మన సీఎం కేసీఆర్ అని విమర్శించారు. లిక్కర్ స్కామ్ చేసి వందల కోట్లు ఖర్చు చేసి రాజశ్యామల యాగం చేశారని, అసెంబ్లీ సాక్షిగా 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేసీఆర్ మోసం చేశారని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయంటేనే నోటిఫికేషన్లు ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తారని ఆరోపించారు. ఉద్యోగాల విషయంలో కేంద్ర ఎప్పుడూ మాట తప్పలేదని, తెలంగాణ సమాజం కోసం చావడానికైనా సిద్ధమే అని ఆయన అన్నారు.