NTV Telugu Site icon

Bandi Sanjay: కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే.. బీఆర్ఎస్ జాబితాపై బండి కామెంట్స్

Bandi Sanjay

Bandi Sanjay

Bandi Sanjay: కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే అంటూ బీఆర్ఎస్ జాబితాపై కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోని మంకమ్మతోట 55 డివిజన్ లో కమ్యూనిటీ హాల్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇప్పుడు ప్రకటించిన సీట్లలో సగం మందికి బీ ఫామ్ లు రావని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ప్రకటించిన సీట్లన్నీ ఉత్తుత్తివే అని అన్నారు. ఒకరికి టికెట్ ఇచ్చి..మరొకరిని ఇంటికి పిలుస్తున్నారని తెలిపారు. కేసీఆర్ బిడ్డకు సీటిస్తే.. మహిళలకు 33 శాతం ఇచ్చినట్టేనా? అని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్, బీసీల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కి లేదని అన్నారు.

Read also: Etela Rajender: బీజేపీలోకి వెళతారనే భయంతో టికెట్ లు అనౌన్స్ చేశారు..! ఈటెల సంచలన వ్యాఖ్యలు..

బీసీలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి జరుగుతుంది… కొందరు ఎమ్మెల్యేలు దళిత బంధులో 30శాతం కమీషన్లు తీసుకున్నారు అని కేసీఆరే అన్నారు.. ఆ అవినీతి పరులకు టికెట్లు ఎలా ఇచ్చారు? అని ప్రశ్నించారు బండి సంజయ్. ప్రజల్లో కేసీఆర్ పాలన పట్ల తీవ్ర వ్యతిరేకత ఉందని మండిపడ్డారు. బీజేపీ గ్రాఫ్ పడిపోలేదు… ఎన్నికల ఫలితాలతో తెలుస్తుంది బీజేపీ సత్తా ఏంటనేది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే చంద్ర మండలం కూడా ఖతమేనని, చంద్రుని మీద కూడా సీఎం భూములిస్తామంటారని బండి సంజయ్ ఎద్దేవ చేశారు.
Shamshabad: శంషాబాద్‌లో దుబాయ్‌ విమానం ఎమర్జెన్సీ లాండింగ్‌.. నలుగురు ప్రయాణికుల్ని దించేసిన పైలట్