Bandi Sanjay : ‘పన్నులు కట్టేది మనం. బిల్లులు కట్టేది మనం…సర్కారుకు ఖజానా చేకూర్చేది మనం. మరి మన ఆలయాల కోసం, బోనాల కోసం పైసలియ్యాలంటూ ప్రతి ఏటా బిచ్చమెత్తుకునే దుస్థితి మనకెందుకు?’’అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే ఎవరినీ యాచించే అవసరమే లేకుండా బోనాల ఉత్సవాలతోపాటు హిందువుల పండుగలన్నింటికీ నిధులు కేటాయించి ప్రతి ఒక్క హిందువు గర్వించేలా ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు. టెర్రరిస్టుల బాంబు పేళుల్లు, జిహాదీ గ్యాంగులతో ఇల్లు వాకిలి వదిలివెళ్లిన పాతబస్తీ ప్రజలంతా తిరిగి తమ సొంత ఇండ్లకు తిరిగి రావాలని పిలుపునిచ్చారు. ‘‘పాతబస్తీ వాసులారా… మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా…. సింహవాహిని అమ్మవారి సాక్షిగా, భాగ్యలక్ష్మీ పాదాల సాక్షిగా మీకు అండగా నేనున్నా…పాతబస్తీ మీది. మీకే భయం అక్కర్లేదు. మీ ఇంటికి మీరు రండి. మిమ్ముల్ని రక్షించే బాధ్యత మేం తీసుకుంటాం. హిందువులందరినీ ఓటు బ్యాంకుగా మార్చి హిందువుల సత్తా చాటుతాం.’’అంటూ భరోసా ఇచ్చారు.
పాతబస్తీ బోనాల సందర్భంగా ఆదివారం ఉదయం నుండి సాయంత్రం పొద్దుపోయేదాకా బండి సంజయ్ గల్లీ గల్లీ తిరుగుతూ అమ్మవార్ల ఆలయాలను దర్శిస్తూ బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఉదయం మూసారాంబాగ్ పోచమ్మ బోనాల ఉత్సవాలతో ప్రారంభమైన బండి సంజయ్ యాత్ర అక్బర్ బాగ్, సైదాబాద్, కుర్మగూడ, మాదన్నపేట, రక్షాపురం, గౌలిపురా, అక్కన్నమాదన్న హరిబౌలి ఆలయాల మీదుగా భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకుని వేలాది భక్తులను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ఏమన్నారంటే…
పాతబస్తీలో ఏ గల్లీ చూసినా మహిళలంతా అమ్మవారిలా తయారై పండుగ చేసుకుంటున్నరు. పిల్లలు, యువత అంతా బోనాల ఉత్సవాల్లో జోష్ తో ఉన్నరు. బోనం అంటే అమ్మవారికి ఇష్టంగా సమర్పించే నైవేద్యం. ఈ పండుగకు ఓ సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఈ వానా కాలంలో అనేక రోగాలు పుట్టుకొస్తయ్. వాటినుండి తప్పించి సల్లంగ సూడు తల్లీ అని అమ్మవారికి మొక్కుకుని ఈ బోనం సమర్పిస్తారు. బోనం చుట్టూ పసుపు పూస్తం. వేపాకులు కడ్తం. దీనివల్ల బ్యాక్టీరియా, వైరస్ లు నాశనమై మన ఆరోగ్యం పైలంగా ఉంటదని నమ్ముతం.
250 ఏళ్ల క్రితం ప్లేగ్ వ్యాధితో జనం పిట్టల్లా రాలిపోతుంటే.. ఈ వ్యాధి తగ్గితే అమ్మవారికి గుడి కట్టించి బోనాలు జరుపుతామని అప్పటి జవాన్లు, ప్రజలు మొక్కుకున్నారు. అమ్మవారి దయతో ఆ వ్యాధి తగ్గిపోవడంతో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి గుడి కట్టించి ఘనంగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటున్నం. 1908లో మూసీ నది వరదలతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైతే… ఇట్లనే అమ్మవారికి మొక్కుకుంటే తగ్గిపోయింది. అప్పటి నుండి లాల్ దర్వాజా అమ్మవారికి బోనాల ఉత్సవాలను జరపడం ఆనవాయితిగా మారింది. భాగ్యనగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎల్లవేళలా రక్షిస్తున్న మన భాగ్యలక్ష్మీసహా అమ్మవార్లందరినీ దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది.
1908లో మూసీ నది వరదలతో హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైతే… ఇట్లనే అమ్మవారికి మొక్కుకుంటే తగ్గిపోయింది. అప్పటి నుండి లాల్ దర్వాజా అమ్మవారికి బోనాల ఉత్సవాలను జరపడం ఆనవాయితిగా మారింది. భాగ్యనగరాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ ఎల్లవేళలా రక్షిస్తున్న మన భాగ్యలక్ష్మీసహా అమ్మవార్లందరినీ దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం ఆనందంగా ఉంది. ఇయాళ ఇగల్లీగల్లీలోనూ ప్రతి ఏటా బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటూ సంస్క్రుతిని కాపాడుకుంటున్నాం. తరాలు మారినా, అంతరాలు ఏర్పడ్డా బోనాల పండుగ ఆగదు.. అమ్మవారికి ఇష్టంగా బోనం సమర్పిస్తాం. హిందూ సాంప్రదాయాన్ని కొనసాగిస్తాం. శక్తివంతమైన పండుగ బోనాలు. ప్రతి ఏటా అమ్మవారిని దర్శించుకుని హిందువుగా పుట్టినందున ఈ దేశం, హిందూ ధర్మ రక్షణ కోసం ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తా.
Fire in Ferry: నడి సముద్రంలో షిప్‌లో భారీగా మంటలు.. 280కి పైగా ప్రయాణికులు.. చివరికీ..
సింహవాహిని అమ్మవారి దయ, భాగ్యలక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షంవల్ల అందరం చల్లగా ఉన్నాం. నేను సైతం భాగ్యలక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలతోనే ప్రజా సంగ్రామ యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని తెలంగాణ హిందుత్వాన్ని విస్తరించినం. ఈ సందర్భంగా యూపీఏ పాలనలో టెర్రరిస్టుల బాంబు పేళుల్లు, జిహాదీ గ్యాంగులతో ఇల్లు వాకిలి వదిలివెళ్లిన పాతబస్తీ ప్రజలను అప్పీల్ చేస్తున్నా…. సింహవాహిని అమ్మవారి సాక్షిగా, భాగ్యలక్ష్మీ పాదాల సాక్షిగా మీకు అండగా నేనున్నా…పాతబస్తీ మీది. మీకే భయం అక్కర్లేదు. మీ ఇంటికి మీరు రండి. మిమ్ముల్ని రక్షించే బాధ్యత మేం తీసుకుంటాం. హిందువులందరినీ ఓటు బ్యాంకుగా మార్చి హిందువుల సత్తా చాటుతాం. దేశంలోని ఏ ప్రముఖుడు వచ్చినా భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకునేలా చేశామంటే హిందూ సమాజ శక్తికి నిదర్శనం. చార్మినార్ వద్ద ఒకప్పుడు బొట్టు పెట్టుకుని కాషాయ జెండా పట్టుకోవాలంటే భయపడే రోజుల నుండి ఇయాళ భాగ్యలక్ష్మీ అమ్మవారి సాక్షిగా జై శ్రీరాం అని గర్జించి గాండ్రించి సత్తా చాటిన సమాజం నా హిందూ సమాజనిదే.
ఈ పండుగ సందర్భంగా అందరం ప్రతిజ్ఝ చేద్దాం. ఈరోజు అన్ని పార్టీలు 12 శాతం ముస్లిం ఓట్లకు కక్కుర్తి పడుతున్నాయి. హిందువులంతా గంపగుత్తగా మారరనే ఉద్దేశంతో వాళ్లకు వంత పాడుతున్నాయి. ఈ తరుణంలో మనం ఏం చేస్తే తెలంగాణలో రామరాజ్యం వస్తుందో ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది.
ఇయాళ ఏ ఆలయాలకు పోయినా రెండు పార్టీలు మాకు హారతి ఇవ్వడం లేదు. ప్రోటోకాల్ ఇవ్వడం లేదని కొట్లాడుకుంటున్నారు. కానీ మేం అలా చేయడం లేదు. పాతబస్తీలో బీజేపీ అధికారంలోకి వస్తే బోనాల పండుగకు నిధులు కేటాయించి ఎవరిని యాచించే దుస్థితి లేకుండా చేస్తాం. ప్రతి హిందువు గుండెమీద చేయి వేసుకుని ఆలోచించాలి.
హిందూ ఆలయాల కోసం పైసలు అడుక్కోవాల్సిన ఖర్మ హిందువులకు ఎందుకు వచ్చింది? పాతబస్తీలో పన్నులు కడుతున్నది, నల్లా బిల్లులు, కరెంట్ సహా ప్రతి బిల్లును హిందువులు చెల్లిస్తున్నరు. కానీ ఒక వర్గం మాత్రం బిల్లులు చెల్లించకుండా బెదిరిస్తున్నరు. ఈ దుస్థితి పోవాలంటే తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి రావాలో ఆలోచించాలి. దయచేసి ప్రతి ఒక్కరూ ‘‘హిందూ ధర్మ రక్షణ కోసం, సమాజ హితం కోసం, సనాతన ధర్మం కోసం పాటు పడుతానని ఆపదొస్తే హిందువుగా ముందుకు వచ్చి యుద్దం చేయాలని కోరుతున్నా.
YS Jagan: “ఇదే టీడీపీ అసలు ఎజెండా”.. వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్‌పై మాజీ సీఎం జగన్ ఫైర్..
