తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. నియంత, అవినీతి, కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు సహించరు. హుజూరాబాద్ ఉప ఎన్నిక అదే నిరూపించింది అని అన్నారు. బీజేపీ ని బద్నం చేయాలని కేసీఆర్ చూస్తున్నాడు… ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ అని తెలిపారు. ప్రజలు ఛీత్కరించిన పరవాలేదు బీజేపీ ని బ్లెమ్ చేయాలని తెగించాడు. కేసీఆర్ కు రాజకీయ పతనం ప్రారంభం అయిందని ఆయన జోతిష్కుడు ఆయనకు చెప్పాడు అంట. తెలంగాణ మంచి రోజులు రాబోతున్నాయని జ్యోతిస్కుడు నాకు చెప్పారు. ఇక రక్తం దారబోసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి. సీఎం కుటుంబంలో కొట్లాట మొదలైంది…. నన్ను సీఎం ని ఎప్పుడు చేస్తావని కుటుంబ సభ్యులు కేసీఆర్ ను ఒత్తిడి చేస్తున్నారు అని బండి సంజయ్ పేర్కొన్నారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీ టూర్ : బండి సంజయ్
