Bandi Sanjay Calls BJP Leaders To Give Historic Success To Modi Warangal Event: ప్రధాని నరేంద్ర మోడీ రేపు ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించి బహిరంగ సభలు నిర్వహించబోతున్నారని.. హన్మకొండలో జరగబోయే సభను కనీవినీ ఎరగని రీతిలో సక్సెస్ చేసి చరిత్ర స్రుష్టించాలని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ పిలుపునిచ్చారు. బీజేపీ హన్మకొండ జిల్లా ముఖ్య నాయకులతో సమావేశమైన సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ చాలా గొప్ప మనిషి అని, నిరంతరం ప్రజల కోసం పరితపించే వ్యక్తి అని కొనియాడారు. బహిరంగ సభల్లో కొందరు టీఆర్ఎస్ నేతలు పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి, జై జై అంటూ నినాదాలు చేయించుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. అలాంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Extramarital Affair: ఓవైపు ఎఫైర్, మరోవైపు వరకట్న వేధింపులు.. చివరికి ఆ వివాహిత?
కరీంనగర్ – వరంగల్ జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం రూ.2146 కోట్లను ప్రధాని మోడీ కేటాయించారని బండి సంజయ్ పేర్కొన్నారు. గుజరాత్‌లో పవర్ ఇంజిన్ తయారు చేసే లోకో యూనిట్ ఉందని.. అక్కడికి ఇక్కడి నుంచి వస్తువులు తీసుకుపోయే ఫ్యాక్టర్టీనే ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. దీనివల్ల వేలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వస్తాయన్నారు. అయినప్పటికీ దీనిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. గతంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం వరంగల్ జిల్లాకు చేసిందేమీ లేదని.. బీఆర్ఎస్ ఈ జిల్లాలో పెద్ద పరిశ్రమలు తెచ్చిందేమీ లేదని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకు వేదికగా జరగబోయే ప్రధాని మోడీ బహిరంగ సభకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రజల్ని సమీకరించాలని, ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పారు.
CV Anand: హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో 7 వేల మందికి టోకరా.. రూ.200 కోట్లు ఢమాల్
తెలంగాణలో కేవలం రెండేళ్లలో 18 బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర బీజేపీకి ఉంది, దేశంలోనే ఇంత తక్కువ సమయంలో ఇన్ని సభలు నిర్వహించిన దాఖలాలే లేవని బండి సంజయ్ తెలిపారు. మోడీ సభను ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ చేయాలని, అందుకోసం ఒక్కో కార్యకర్త కనీసం 50 మందిని సభకు తీసుకురావాలని, అలాగే ఒక్కో డివిజన్ నుండి 2 వేల మందిని సభకు హాజరయ్యేలా చూడాలని సూచించారు. మోడీ, బీజేపీ నినాదాలతో ఓరుగల్లు మొత్తం మారుమోగాలన్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ మాధ్యమంగా సభకు రావాలని ప్రతిఒక్కరినీ పిలవాలన్నారు. తెలంగాణలో బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించే వాళ్లకు.. మోడీ సభ సక్సెస్‌తో సమాధానం చెప్పాలన్నారు. దీంతో పాటు బీఆర్ఎస్‌తో బీజేపీ కుమ్మక్కైందనే దుష్ప్రచారాన్ని సైతం తిప్పికొట్టాలని చెప్పుకొచ్చారు.