Bandi Sanjay: బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు సంబంధమే లేదని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కుటుంబానికి ఏ ఆపద వచ్చినా… తెలంగాణ సమాజం అంటారని ఆరోపించారు. ఆ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడే తెలంగాణ సమాజం గుర్తుకు వస్తుందని ఎద్దేవ చేశారు. కేసీఆర్ బిడ్డ వలన తెలంగాణ సమాజం తల దించుకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. కేసీఆర్ బిడ్డ లంగ దందా దొంగ దందా చేసి, ఇప్పుడు తెలంగాణ సమాజం తలవంచదు అంటే నవ్వొస్తోందని అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని మాతో సహా స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలు ఆరోపించాయని గుర్తు చేశారు. బీజేపీ కి దర్యాప్తు సంస్థలకు ఎటువంటి సంబంధమే లేదని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపై చట్టప్రకారం దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకుంటాయని బండి సంజయ్ అన్నారు.
Read also: Delhi liquor scam case: దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తా.. కానీ టైం కావాలీ..
లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం పై కేసీఆర్, కేటీఆర్ ఇప్పటికీ ఎందుకు స్పందించడం లేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ కొత్తకొత్త డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం చేతిలో ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ బిడ్డ కవిత చేసిన దుర్మార్గపు చర్యల వలన ప్రజలు ఛీత్కరించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. దొంగే.. దొంగ దొంగ అన్నట్టు కవిత వ్యవహారం ఉందని ఎద్దేవ చేశారు. BRS పార్టీలో ఎంతమంది మహిళలకు స్థానం కల్పించారు? అంటూ ప్రశ్నించారు. BRS పార్టీలో తొలి కేబినెట్ లో మహిళా మంత్రే లేరని అన్నారు. మహిళ దినోత్సవం ను జరిపే అర్హత BRS పార్టీకి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. ఎస్టీ మహిళ అయిన ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోదీ దే అన్నారు. తెలంగాణలో 17% హత్యలు, అత్యాచారాలు పెరుగుతున్నాయని NCRB లెక్కలే చెబుతున్నాయని బండి సంజయ్ అన్నారు. కవిత చేసిన దొంగ దందా, పత్తాల దందా తెలంగాణ కోసమా? తెలంగాణ సమాజం కోసమా? అంటూ ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు అన్నవి బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాలేదు. అంతకుముందు నుంచే ఉన్నాయని స్పష్టం చేశారు బండిసంజయ్.
Kishan reddy: ఈడీ నోటీసులు ఇస్తే తప్పేంటి? అయినా దాంతో మాకు సంబంధం లేదు..