NTV Telugu Site icon

Bandi Sanjay : నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలి

Bandi Snajay

Bandi Snajay

తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డ్” (TREIRB) 2024 సంవత్సరంలో నిర్వహించిన వివిధ గురుకుల ఉపాధ్యాయ ఖాళీల భర్తీ పరీక్షలకు వేల సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు పోటీ పడ్డారు. అందులో భాగంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేశారు. తర్వాత జాబితా తయారుచేసి వారి సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం మెరిట్ అభ్యర్థులకు ఉద్యోగ నియామకం ప్రక్రియ చేపట్టారు. అయితే డిసెన్డింగ్ ఆర్డర్ విధానంలో(డి- ఎల్ > జె- ఎల్ > పిజిటీ > టిజిటీ) జరిగితే వివిధ రకాల క్యాడర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు పెద్ద క్యాడర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకొని మిగతా కేడర్ ఉద్యోగాలకు రీలిన్క్విష్మెంట్ (relinquishment) లెటర్ ఇవ్వడం వల్ల ఒక అభ్యర్థి అనేక ఉద్యోగాలకు ఎంపికైనా కూడా ఆ స్థానాలు ఖాళీగా ఉండకుండా తర్వాతి మెరిట్ అభ్యర్థులతో నింపడం వల్ల ఎలాంటి ఖాళీలు ఉండవు. దీనివల్ల విద్యా సంవత్సరంలో విద్యార్థులకు బోధన కుంటు పడకుండా అధ్యాపకులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. దీనివల్ల నాణ్యమైన విద్య విద్యార్థికి అందుతుంది. అదేవిధంగా మెరిట్ అభ్యర్థి నష్టపోకుండా తనకి ఉద్యోగ అవకాశము కూడా దక్కుతుంది.

అట్లా కాకుండా డిసెండింగ్ ఆర్డర్ విధానంలో వివిధ క్యాడర్ పోస్టులకు రిలింక్విష్మెన్ట్ తీసుకోకుండా, తర్వాతి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయకపోతే ఏర్పడే ఈ ఖాళీలను భర్తీ చేయడానికి మరొక నోటిఫికేషన్ ఇవ్వడం వల్ల తర్వాత మెరిట్ లో ఉన్న అభ్యర్థులు మళ్లీ పోటీ పడడంలో అననుకూల పరిస్థితుల్లో నష్టం కలిగే అవకాశం కలదు. కావున ప్రభుత్వం గతంలో ఏరకంగానైతే డిసెండింగ్ ఆర్డర్ విధానంలో నియామక ప్రక్రియ చేపట్టి రిలింక్విస్మెంట్ విధానంలో ఖాళీలు ఏర్పడకుండా మెరిట్ అభ్యర్థులకు అవకాశం ఇస్తూ నియామకం చేపట్టారో, అదేవిధంగా ఇప్పుడు కూడా అదే విధానంలో నియామక ప్రక్రియ చేపట్టి, దాదాపు 3000 మంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని బండి సంజయ్‌ అన్నారు.