రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీకి బలమయిన ప్రత్యామ్నాయంగా ఎదుగుతాం అంటున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ లో బండి సంజయ్ అనేక అంశాలు ప్రస్తావించారు.
రెండేళ్ళ పదవీకాలం చాలా సంతృప్తినిచ్చింది. అందరి సహకారం, నేతల సలహాలతో లక్ష్యాల వైపు అడుగులేశా. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీజేపీని అధికారంలోకి తెస్తాం. దుబ్బాక, హుజూరాబాద్ ఎన్నికల్లో మేం గెలిచాం. టీఆర్ఎస్ డబ్బులు బాగా ఖర్చుపెట్టింది. నియోజకవర్గాలు అన్నింటిలో మేం పోటీచేశాం. మాకు నాయకులు తక్కువ మంది లేరనేది తప్పు. అన్ని చోట్ల ముగ్గురు పోటీకి రెడీగా వున్నారు.
గతంలో ఇద్దరు ఎంపీలు వున్నప్పుడు అంతా బీజేపీని చూసి వ్యంగ్యంగా నవ్వారు. మమ్మల్ని ఆదరిస్తే నవ్వినవాళ్ళని చూసి నవ్వుతున్నారు. పంజాబ్ లో ఓటు శాతం పెరిగింది. ఐదురాష్ట్రాల ఎన్నికల్లో ఓట్లశాతం పెరిగింది. సీట్లు కాదు చూడాల్సింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మేం బాగా పుంజుకున్నాం. టీఆర్ ఎస్ కీ మాకు ఆరువేల ఓట్లే తేడా. ఇతర కార్పోరేషన్ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు శాతం పెంచుకుంటూ పోతున్నాం.
యూపీ ఎన్నికల తర్వాత బీజేపీ అవుట్ అన్నారు కేసీఆర్. ఏం జరిగిందో చూడండి. కేసీఆర్ ఇంటిదగ్గర కూర్చున్నారు. మేం డబుల్ ఇంజిన్ అంటుంటే ఆయనకి ట్రబుల్ ఇంజిన్ అవుతుంది. ఇంజిన్ ఒక చోటు బోగీలు ఒకచోట వుంటే ఎలా ముందుకెళుతుంది. ధనిక రాష్ట్రం ఎందుకు పేద రాష్ట్రంగా అప్పుల రాష్ట్రంగా మారింది. పెన్షన్, రైతు రుణమాఫీ ఎందుకు సరిగా పడడం లేదు. బీజేపీని ఆపేందుకు కేసీఆర్ ఫ్రంట్ ల గురించి మాట్లాడుతున్నారు. బీజేపీని ఎవరూ ఆపలేరు. కాంగ్రెస్, ఎంఐఎంలు బీజేపీని ఎందుకు ఆపలేకపోయారని బండి సంజయ్ ప్రశ్నించారు.
వరి ధాన్యం విషయంలో కేంద్రం వివక్ష చూపడంలేదన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లినా పట్టించుకోలేదు. జనం దృష్టి మళ్ళించడానికి కేసీఆర్ బీజేపీపై మండిపడుతున్నారు. బాయిల్డ్ రైస్ గురించి ఎందుకు రాసిచ్చారు. తెలంగాణ ఇస్తామన్న ధాన్యం ఇవ్వడం లేదు. కేంద్రం కొననని అనడం లేదు. కేంద్రం కొంటానన్న కేసీఆర్ ఇవ్వడం లేదు. కేంద్రానికి ధాన్యం ఇవ్వని రాష్ట్రం తెలంగాణ. మేం కొనమంటే ఏ ముఖం పెట్టుకుని వెళతారు. తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తాం, పార్లమెంటులో మేం పోరాడతామని కేసీఆర్ అంటున్నారు. కేంద్రం సమాధానం చెబుతుంది. ఎంపీగా తానేం చేశానో అందరికీ తెలుసు. నేషనల్ హైవేకు 2వేల కోట్లు తెచ్చా. కరీంనగర్ కి ఎంతో చేశా. జనాన్ని రెచ్చగొడతా అనే ఆరోపణలు చేస్తున్నారు. బీజేపీపై మతతత్వ ఆరోపణలు చేశారు. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో మాకు మంచి సీట్లు వచ్చాయి. మా వల్ల ఎన్ని గొడవలు జరిగాయన్నారు బండి సంజయ్.
గోరక్షకుల మీద దాడులు జరుగుతున్నాయి. ఎంఐఎం సెక్యులర్ పార్టీనా అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మద్దతు ఇస్తేనే తెలంగాణ వచ్చింది. కేంద్ర నిఘా సంస్థల్ని బీజేపీ ఉసిగొల్పి రాష్ట్రాలను భయపెడుతోందనే ఆరోపణలు నిజమయినవి కావు. కేసీఆర్ ప్రజల్ని నమ్మించి, మరోసారి ప్రజల సానుభూతి పొందాలని చూస్తున్నారు. నీ నియంత పాలన, కుటుంబపాలనను తట్టుకోలేకపోతున్నారు. వెంటనే ఎన్నికలు జరగాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు బండి సంజయ్.